Matthew 14

Matthew 14:1

హేరోదు యేసు గురించి ఏమనుకున్నాడు?

బాప్తిసమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడని హేరోదు యేసును గురించి అనుకున్నాడు (14:2).

Matthew 14:3

హేరోదు చేసిన ఏ అన్యాయమైన పనిని గూర్చి యోహాను చెప్పాడు?

హేరోదు తన సోదరుని భార్యను ఉంచుకొన్నాడని యోహాను చెప్పాడు (14:4).

హేరోదు యోహానుకు వెంటనే మరణ శిక్ష ఎందుకు విధించ లేదు?

ప్రజలు ఇతనిని ప్రవక్త అని గౌరవిస్తున్నందువల్ల ప్రజలకు భయపడి హేరోదు యోహానుకు వెంటనే మరణ శిక్ష విధించలేదు (14:5).

Matthew 14:6

తన జన్మదినం నాడు హేరోదియ నాట్యం చేసినప్పుడు హేరోదు ఏమి చేశాడు?

హేరోదియ ఏమి కోరినా ఇస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు (14:7).

Matthew 14:8

హేరోదియ ఏమి కోరుకుంది?

ఒక పళ్ళెంలోయోహాను తలను తెచ్చి ఇవ్వమని కోరింది (14:8).

హేరోదు ఆమె కోరికను ఎందుకు తీర్చవలసి వచ్చింది?

విందు సమయంలో ప్రజలందరి ఎదుటా చేసిన ప్రమాణం నెరవేర్చుకోవడానికి ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది. (14:9).

Matthew 14:13

జనసమూహములు తనను వెంబడిస్తున్నప్పుడు వారిని చూసి యేసు ఏమి చేశాడు?

జనసమూహములను చూసి యేసు వారిపై కనికరపడి, వారిలో రోగులను స్వస్థపరిచాడు (14:14).

Matthew 14:16

యేసు తన శిష్యులతో ఏమి చెప్పాడు?

జనసమూహములకు మీరే భోజనము పెట్టమని యేసు తన శిష్యులతో చెప్పాడు (14:16).

Matthew 14:19

యేసు, తన శిష్యులు తెచ్చిన అయిదు రొట్టెలు, రెండు చేపలను ఏమిచేశాడు?

యేసు ఆ రొట్టెలను, చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు జనసమూహమునకు పంచమని శిష్యులకు ఇచ్చాడు (14:19).

ఎంతమంది ప్రజలు భుజించారు? ఇంకా ఎంత మిగిలిపోయింది?

అయిదు వేలమంది పురుషులతోపాటు స్త్రీలు, పిల్లలు తినగా పన్నెండు గంపలు మిగిలిపోయాయి (14:20-21).

Matthew 14:22

జనసమూహాన్ని పంపివేసిన తరువాత యేసు ఏమి చేశాడు?

యేసు ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండ పైకి వెళ్ళాడు (14:23).

సముద్రం మధ్యలో ఉన్న శిష్యులకు ఏమి జరిగింది?

బలమైన గాలి వీచినప్పుడు శిష్యులు ప్రయాణిస్తున్న నావ అదుపుతప్పింది (14:24).

Matthew 14:25

యేసు తన శిష్యుల దగ్గరకు ఎలా వచ్చాడు?

యేసు నీళ్ళపై నడుచుకుంటూ వచ్చాడు (14:25).

శిష్యులు యేసును చూసినప్పుడు ఆయన వారితో ఏమని చెప్పాడు?

యేసు తన శిష్యులకు నేనే, భయపడవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పాడు (14:27).

Matthew 14:28

పేతురు తన దగ్గరకు చేస్తానని యేసుతో చెప్పినప్పుడు యేసు ఏమన్నాడు?

నీళ్ళపై నడచి రమ్మని యేసు పేతురుతో చెప్పాడు (14:29).

పేతురు నీళ్ళలో ఎందుకు మునిగిపోతున్నాడు?

పేతురు భయపడినప్పుడు నీళ్ళలో మునిగిపోవడం మొదలుపెట్టాడు (14:30).

Matthew 14:31

యేసు, పేతురు దోనె ఎక్కినప్పుడు ఏమి జరిగింది?

యేసు, పేతురు దోనె ఎక్కినప్పుడు గాలి అణగిపోయింది (14:32).

ఇది చూసిన శిష్యులు ఏమి చేశారు?

దీనిని చూసిన శిష్యులు యేసు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కారు (14:33).

Matthew 14:34

యేసు, ఆయన శిష్యులు సముద్రపు అవతలి తీరం చేరుకొన్నప్పుడు అక్కడి ప్రజలు ఏమి చేశారు?

యేసు, ఆయన శిష్యులు సముద్రపు అవతలి తీరం చేరుకొన్నప్పుడు ప్రజలు రోగులను యేసు దగ్గరకు తీసుకువచ్చారు (14:35).