Matthew 13

Matthew 13:3

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాయి?

త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి తినివేశాయి (13:4).

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు ఏమయ్యాయి?

మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు అక్కడ మన్ను లేనందున అవి మొలిచాయి గానీ, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి (13:5-6).

Matthew 13:7

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి?

ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మొలిచి ముండ్లపొదలు పెరిగి వాటిని అణచివేశాయి (13:7).

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మంచి నేలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి?

మంచి నేలలో పడిన విత్తనాలు ఒకటి నూరంతలుగా, ఒకటి అరువదంతలుగా, ఒకటి ముప్పదంతలుగా ఫలించాయి (13:8).

Matthew 13:13

యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు, చూస్తారు గానీ ఏమి చెయ్యరు?

యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు గానీ గ్రహించరు, చూస్తారు గానీ ఎంతమాత్రము తెలుసుకోరు (13:14).

Matthew 13:15

యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజలలో ఉన్న తప్పు ఏమిటి?

యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజల హృదయాలు కొవ్వు పట్టాయి. వారి చెవులు మందములయ్యాయి, వారి కన్నులు మూసికోనిపోయాయి (13:15).

Matthew 13:18

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

త్రోవ పక్కన పడిన విత్తనం వలే ఒక వ్యక్తివాక్యము విని దానిని గ్రహించక ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయములో చల్లిన దానిని ఎత్తుకుపోతాడు (13:19).

Matthew 13:20

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో రాతి నేలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

రాతి నెలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని వెంటనే దానిని సంతోషముగా గ్రహించును కానీ, వాక్యము నిమిత్తము శ్రమ అయినను, హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు (13:20-21).

Matthew 13:22

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో ముండ్ల పొదలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

ముండ్ల పొదలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తిని ఐహిక విచారములు, ధన మోహము ఆ వాక్యము అణచివేస్తాయి (13:22).

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మంచి నేలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

మంచి నేలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని గ్రహించి, సఫలుడై, నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా ఫలిస్తాడు (13:23).

Matthew 13:27

గురుగులు విత్తువాని ఉపమానంలో పొలములో గురుగులు చల్లినది ఎవరు?

శత్రువు పొలములో గురుగులు చల్లాడు (13:28).

Matthew 13:29

గురుగులు, గోధుమల గురించి యజమాని తన సేవకులకు ఇచ్చిన సూచనలు ఏమిటి?

రెండు పంటలూ కలసి పెరిగిన తరువాత కోతకాలము వచ్చినప్పుడు, గోధుమలను గిడ్డంగిలో సమకూర్చి, గురుగులను తగలబెట్టమని యజమాని చెప్పాడు (13:30).

Matthew 13:31

యేసు చెప్పిన ఆవగింజ ఉపమానంలో చిన్నదైన ఆవగింజ ఏమి అవుతుంది?

ఆవగింజ మొక్క పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసించునంత చెట్టు అవుతుంది (13:31-32).

Matthew 13:33

పరలోక రాజ్యమును పులిసిన పిండితో ఎందుకు పోల్చాడు?

పరలోక రాజ్యము కొంచెము పొంగజేసే పదార్థం కలిసిన మూడు కుంచాల పిండి తో పోల్చబడినది (13:33).

Matthew 13:36

గురుగుల ఉపమానంలో, మంచి విత్తనం విత్తువాడు ఎవరు? పంట పొలం ఏమిటి? మంచి విత్తనాలు ఎవరు? గురుగులు ఎవరు? పంట కోయువారు ఎవరు?

మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు, పంట పొలం లోకం, మంచి విత్తనాలు రాజ్య వారసులు, గురుగులు దుష్టుని సంబంధులు, పంట కోయువారు దేవదూతలు (13:37-39).

Matthew 13:40

యుగసమాప్తిలో దుర్నీతిపరులకు ఏమి జరుగుతుంది?

యుగసమాప్తిలో దుర్నీతిపరులు అగ్నిగుండములో పడవేయబడతారు (13:42).

యుగసమాప్తిలో నీతిమంతులకు ఏమి జరుగుతుంది?

యుగసమాప్తిలో నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యునివలే తేజరిల్లుతారు (13:43).

Matthew 13:44

యేసు చెప్పిన ఉపమానంలో, పరలోక రాజ్యముతో పోల్చబడిన పొలములో దొరికిన నిధి విషయంలో ఒక వ్యక్తి ఏమి చేశాడు?

తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలము కొన్నాడు (13:44).

యేసు చెప్పిన ఉపమానంలో, పరలోక రాజ్యముతో పోల్చబడిన మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి ఏమి చేశాడు?

మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి అ ముత్యం కొన్నాడు (13:45-46).

Matthew 13:47

చేపలు పట్టే వల ఉపమానం యుగసమాప్తిలో జరగబోయే దేనిని సూచిస్తుంది?

వల నిండినప్పుడు మంచి చేపలను గంపలోకి చేర్చి, చెడ్డవాటిని బయట పారవేస్తారు. అదే విధంగా యుగసమాప్తిలో దేవదూతలు నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పాడవేస్తారు (13:47-50).

Matthew 13:54

యేసు స్వదేశీయులు ఆయన బోధలు విన్నప్పుడు ఏమని ప్రశ్నించారు?

"ఈ జ్ఞానం, ఈ అద్భుతములు చేసే శక్తి ఎక్కడినుంచి వచ్చాయి" అని ఆశ్చర్యపడ్డారు (13:54).

Matthew 13:57

ప్రవక్తకు తన దేశములో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ప్రవక్త తన దేశములో, తన యింటిలో ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు (13:57).

యేసు స్వదేశీయుల అవిశ్వాసం వల్ల ఏమి జరిగింది?

స్వదేశీయుల అవిశ్వాసం వల్ల యేసు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు (13:58).