Matthew 12

Matthew 12:1

యేసు శిష్యులు ఏమి చేస్తున్నారని పరిసయ్యులు నేరారోపణ చేశారు?

యేసు శిష్యులు పంటచేనిలో ప్రవేశించి వెన్నులు తుంచి తింటూ విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారని పరిసయ్యులు నేరారోపణ చేశారు (12:2).

Matthew 12:5

దేవాలయము కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

యేసు తానే దేవాలయము కంటే గొప్పవాడినని చెప్పాడు (12:6).

Matthew 12:7

మనుష్య కుమారుడైన యేసుకు ఏ అధికారం ఉంది?

మనుష్య కుమారుడైన యేసు విశ్రాంతి దినానికి ప్రభువు (12:8).

Matthew 12:9

యేసు సమాజ మందిరములో ఊచ చెయ్యి గలవాడిని బాగుచేసినప్పుడు పరిసయ్యులు యేసును ఏమని ప్రశ్నించారు?

పరిసయ్యులు యేసును "విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా?" అని ప్రశ్నించారు (12:10).

Matthew 12:11

సబ్బాతు దినమున ఏమి చేయడం న్యాయమని యేసు చెప్పాడు?

విశ్రాంతి దినమున మేలు చేయుట న్యాయమేనని యేసు చెప్పాడు (12:12).

Matthew 12:13

ఊచ చెయ్యి గలవాడిని యేసు స్వస్థపరచినపుడు ఆయనను ఏమి చెయ్యాలని ఆలోచన చేశారు?

యేసు ఊచ చెయ్యి గలవాడిని స్వస్థపరచినపుడు పరిసయ్యులు ఆలయం బయటకు వెళ్లి యేసును ఎలా సంహరించాలి అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు (12:14).

Matthew 12:19

యేసును గూర్చి యెషయా ప్రవచనం ప్రకారం యేసు ఏమి చేయడు?

యేసును గూర్చి యెషయా ప్రవచనం ప్రకారం యేసు జగడమాడడు, కేకలు వేయడు, నలిగినా రెల్లును విరువడు, మకమకలాడుతున్నఅవిసెనారను ఆర్పడు (12:19-20).

యేసును గురించి యెషయా ప్రవచించినట్టు, దేవుని న్యాయవిధి యేసు ద్వారా ఎవరికి ప్రచురము చేయబడుతుంది?

అన్యజనులకు దేవుని న్యాయవిధి యేసు ద్వారా ఎవరికి ప్రచురము చేయబడుతుంది (12:18,21).

Matthew 12:26

బయల్జేబూలు ద్వారా దయ్యములను వెళ్ళగొట్టే విషయంలో యేసు ఎలా స్పందించాడు?

సాతాను వలన సాతానును వెళ్ళగొడితే సాతాను రాజ్యము ఎలా నిలబడుతుంది అని యేసు చెప్పాడు (12:26).

Matthew 12:28

దేవుని ఆత్మ వలన తాను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

దేవుని ఆత్మ వలన తాను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దేవుని రాజ్యము వారి యొద్దకు వస్తుందని యేసు చెప్పాడు (12:28).

Matthew 12:31

ఎలాంటి పాపం క్షమించబడదని యేసు చెప్పాడు?

ఆత్మ విషయమైన దూషణ అనే పాపం క్షమించబడదని యేసు చెప్పాడు (12:31).

Matthew 12:33

దేని వలన చెట్టు ఎలాంటిదో తెలుస్తుంది?

చెట్టు అది కాసే ఫలాల వలన మంచిదో, కాదో తెలుస్తుంది (12:33).

Matthew 12:36

వేటిని బట్టి పరిసయ్యులు అపరాధులుగా తీర్పు తీర్చబడతారు?

తమ మాటలను బట్టి పరిసయ్యులు అపరాధులుగా తీర్పు తీర్చబడతారు అని యేసు చెప్పాడు(12:37).

Matthew 12:38

ఆయన తన తరం వారికి యేసు ఏ సూచన ఇస్తున్నాడు?

యోనా ఉన్నట్టు, మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండబోతున్నానని యేసు ఈ తరం వారికి సూచన ఇచ్చాడు (12:39-40).

Matthew 12:41

యోనా కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

తాను యోనా కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:41).

నీనెవే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యేసు తరంలోని ప్రజలపై ఏమని నేరస్థాపన చేస్తారు?

నీనివే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యోనా ద్వారా, సొలోమోను ద్వారా దేవుని మాటలు విన్నారు. యేసు తరంలోని ప్రజలపై యోనా, సోలోమోనుల కంటే గొప్పవాడైన యేసు మాటలు వినలేదు (12:41-42).

Matthew 12:42

సొలోమోను కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

తాను సొలోమోను కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:42).

Matthew 12:43

యేసు తరంలోని వ్యక్తిని వదిలిపెట్టిన అపవిత్రాత్మ వడలిపోయిన స్థితి ఎలా ఉంటుంది?

వదిలి పోయిన అపవిత్రాత్మవెళ్లి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ వ్యక్తి కడపటి స్థితి కంటే మొదటి స్థితి హీనమైనదిగా అయ్యేలా చేస్తుంది. యేసు తరంలోని వ్యక్తి అలానే ఉంటాడు(12:43-45).

Matthew 12:48

యేసు తనకు తల్లి, సహోదరుడు, సహోదరి ఎవరని చెప్పాడు?

తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడే తనకు తల్లి, సహోదరుడు, సహోదరి అని యేసు చెప్పాడు (12:46-50).