యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించుట ముగించిన తరువాత పట్టణంలలో బోధించుటకు, ప్రకటించుటకు వెళ్ళిపోయాడు (11:1).
బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుకు, "రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా" అనే సందేశం పంపిచాడు (11:3).
గుడ్డివారు చూచుచున్నారు, చనిపోయినవారు తిరిగి లేస్తున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని యోహానుకు చెప్పమని యేసు చెప్పాడు (11:5).
తన విషయంలో అభ్యంతరపడనివాడు ధన్యుడని యేసు చెప్పాడు (11:6).
మార్గమును సిద్ధపరచడానికి ముందుగా రాబోవు దూత అని బాప్తిస్మం ఇచ్చు యోహానును గూర్చిన ప్రవచనం ఉన్నది అని యేసు చెప్పాడు(11:9-10).
బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏలీయా ప్రవక్త అని యేసు చెప్పాడు (11:14).
బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమియు తినకుండా, త్రాగకుండా ఉండుటను బట్టి అతనికి దయ్యము పట్టింది అన్నారు (11:18).
యేసు ఇతరులతో కలసి తినుచూ, త్రాగుచూ ఉండుటను బట్టి అక్కడివారు అతనిని గూర్చి ఇతడు తిండిబోతు, తాగుబోతు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని చెప్పుకున్నారు (11:19).
విస్తారమైన అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ మార్పు నొందని పట్టణాలపై తీర్పు వస్తుందని యేసు ప్రకటించాడు (11:20-24).
పరలోక రాజ్య విషయాలను జ్ఞానులకు, వివేకులకు మరుగు చేసినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు (11:25).
పరలోక రాజ్య విషయాలను పసిపిల్లలకు, బుద్ధిహీనులకు బయలు పరచినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు (11:25).
తండ్రి తనకు తెలుసుననీ తనకు ఇష్టమైన వారికి తాను బయలు పరుస్తాననీ యేసు చెప్పాడు (11:27).
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త ప్రజలకు ఆయన విశ్రాంతి కలుగజేస్తానని యేసు వాగ్దానం చేశాడు (11:28).