Matthew 4

Matthew 4:1

అపవాది చేత శోధింపబడడానికి యేసును అరణ్యంలోకి ఎవరు కొనిపోయారు?

అపవాది చేత శోధింపబడడానికి యేసును ఆత్మ కొనిపోయాడు (4:1).

యేసు ఎన్ని రోజులు ఉపవాసమున్నాడు?

యేసు నలభై పగళ్ళు , నలభై రాత్రులు ఉపవాసమున్నాడు (4:2).

అపవాది యేసును శోధించిన మొదటి శోధన ఏమిటి?

రాళ్ళను రొట్టెలుగా చేయమని అపవాది యేసును మొదటిగా శోధించాడు (4:3).

మొదటి శోధనకు యేసు చెప్పిన జవాబు ఏమిటి?

మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు జవాబిచ్చాడు (4:4).

Matthew 4:5

అపవాది యేసు ముందు ఉంచిన రెండవ శోధన ఏమిటి?

అపవాది యేసును దేవాలయంపై నుండి క్రిందికి దూకమని చెప్పి శోదించాడు (4:5-6).

Matthew 4:7

రెండవ శోధనకు యేసు ఏమని జవాబిచ్చాడు?

యేసు, ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదని చెప్పాడు (4:7).

అపవాది యేసు ముందు ఉంచిన మూడవ శోధన ఏమిటి?

అపవాది తనకు సాగిలపడి నమస్కారము చేయమని చెప్పాడు (4:8-9).

Matthew 4:10

మూడవ శోధనకు యేసు ఏమని జవాబిచ్చాడు?

ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని యేసు అపవాదికి చెప్పాడు (4:10).

Matthew 4:14

యేసు కపెర్నహూము లోని గలిలయ వచ్చినప్పుడు ఏమి నెరవేర్చబడింది?

గలిలయ లోని ప్రజలకు వెలుగు కనబడింది అని పలికిన యెషయా ప్రవచనం నెరవేరింది (4:15-16).

Matthew 4:17

ఏమి సందేశం యేసు బోధించడం మొదలుపెట్టాడు?

యేసు, "పరలోకరాజ్యము సమీపించియున్నది కనుక మారుమనస్సు పొందుది" అని ప్రకటించడం మొదలుపెట్టాడు" (4:17).

Matthew 4:18

పేతురు, ఆంద్రెయలను ఏమి చేస్తానని యేసు చెప్పాడు?

పేతురు, ఆంద్రెయలను మనుషులను పట్టే జాలరులనుగా చేస్తానని యేసు చెప్పాడు (4:19).

Matthew 4:21

పేతురు, ఆంద్రెయ, యాకోబు మరియు యోహానులు తమ జీవనానికి ఏ పని చేస్తారు?

పేతురు, ఆంద్రెయ, యాకోబు మరియు యోహానులు చేపలు పట్టేవారు (4:18,21).

Matthew 4:23

ఈ సమయంలో బోధించడానికి యేసు ఎక్కడికి వెళ్ళాడు?

యేసు గలిలయలోని సమాజమందిరములోకి వెళ్ళాడు (4:23).

ఏ ఏ రకాల ప్రజలు యేసు దగ్గరకు తేబడుతున్నారు? యేసు వారికి ఏమి చేస్తున్నాడు?

నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్నవారిని, దయ్యములు పట్టినవారిని ఆయన దగ్గరకు తెస్తున్నారు, యేసు వారిని బాగుపరుస్తున్నాడు (4:24).

ఈ సమయంలో ఎంతమంది యేసును అనుసరిస్తున్నారు?

ఈ సమయంలో బహు జనసమూహములు యేసును వెంబడిస్తున్నారు (4:25).