ఆత్మ విషయంలో దీనులైనవారు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యం వారిది (5:3).
దు:ఖపడేవారు ధన్యులు, ఎందుకంటే వారు ఓదార్చబడతారు (5:4).
సాత్వీకులు ధన్యులు, ఎందుకంటే వారు భూలోకంను స్వతంత్రించుకొంటారు (5:5).
నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, ఎందుకంటే వారు తృప్తిపరచబడతారు (5:6).
యేసు నిమిత్తం జనులచే హింసించబడేవారు ధన్యులు, ఎందుకంటే పరలోకమందు వారి ఫలము అధికమౌతుంది (5:11-12).
విశ్వాసులు తమ మంచి క్రియలను బట్టి ఇతరుల ఎదుట తమ వెలుగును ప్రకాశింపనియ్యాలి (5:15-16).
పాత నిబంధన చట్టాలను, ప్రవక్తల ప్రవచనాలను నేరవేర్చడానికే యేసు వచ్చాడు (5:17).
దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఇతరులకు బోధించేవాడు పరలోకంలో గొప్పవాడు (5:19).
నరహత్య చేసేవాడు మాత్రమే కాక, తన సహోదరుని మీద కోపగించేవాడు కూడా తీర్పులోకి ప్రవేశిస్తాడు (5:21-22).
మనం మన సహోదరుని పట్ల విరోధం ఏదైనా ఉన్నట్టయితే అతనితో సమాధానపడాలని యేసు బోధించాడు? (5:23-24).
త్రోవలో ఉండగానే మన ప్రతివాదితో సమాధానపడాలని యేసు బోధించాడు (5:25).
వ్యభిచారం మాత్రమే కాదు గాని ఒక స్త్రీని మోహపు చూపు చూడడం కూడా పాపమేనని యేసు బోధించాడు (5:27-28).
పాపంలో పడేలా చేసే విషయాలను మనం వదిలించుకొని, వాటికి దూరంగా ఉండాలని యేసు చెప్పాడు (5:29-30).
అవివాహితుల మధ్య వ్యభిచారం విషయంలో యేసు విడాకులు అనుమతించాడు (5:32).
వ్యభిచార కారణం లేకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. [5:32].
వీటన్నిటికి మించి మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను అని యేసు చెప్పాడు (5:33-37).
మనం దుష్టుని విషయంలో అతణ్ణి ఎదిరించకుండా ఉండాలని యేసు బోధించాడు (5:38-39).
మన శత్రువులను, మనలను ద్వేషించే వారిని ప్రేమించి, వారి కోసం ప్రార్ధించాలని యేసు బోధించాడు (5:43-44).
మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీరు ప్రత్యేకంగా చేస్తున్నది ఏమిటి? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు గదా అని యేసు చెప్పాడు (5:46-47).