అధ్యాయము 5

1 ఇదండీ అయ్యేనాక యూదులుట పండుగ ఒండు వంచు. యేసు అత్తు కోసమే 2 యెరూషలేమునకు ఓసు.యెరూషలేముకోరు గొర్రెల ద్వారమచ్చి ఒండు కోనేరు కీదు. హీబ్రు భాషకోరు అస పేరు బేతెస్ద. అటి అంజు మంటపలు ఇంచు. 3 రకరకాల రోగాలు ఇక్కిరాయ, గుడ్డియా, కుంటయా 4 సచ్చు కాళ్ళు కీలు ఇక్కిరాయ గుంపులుగా ఆ మంటపాలు కోరు బూదు కీదు. 5 అటి ముప్ఫత్తు ఎట్టు వాటుకాలు నుంచు కాలు కీలు పనిసెయ్యారు ఒండు మెనుషు అటి ఇంచు. 6 యేసు అత్తు పాతు అదు అటి సానా కాలము నుంచే బూదిక్కురుదు గ్రహించుసు,"నల్లుకు ఆగుబేకిండు కోరిగాక్కిరా?" యిండు కేడుసు. 7 అప్పుడు ఆ రోగి,"అయ్యా, దేవదూత తన్నీ ను కాదులుంచునప్పుడు నన్ను కొనేటుకోకు దించిత్తుకు ఎదు ఇల్లా. నాను ఓగురులోపు నాకంటే మిన్నే ఇంకోడాలు దీగాదు " ఇండు జవాబు సొన్నుసు. 8 యేసు "నిను ఎద్ధిందు నీట చాపా వంకుండు నడదు గుండు పో " యిండు అదోటి సొన్నుసు. 9 వెంటనే ఆ మెనుషు నల్లుకాయి అస పరుపు వంకుండు నడక మొదలెక్కుసు. ఆ దినము విశ్రాంతి దినం. 10 అత్తుకు యూదా మత నాయకులు ఆ మెనుషోటి, "ఈ దినం విశ్రాంతి దినం. నీను పరుపు పెచ్చుంగుదు ఆల్య్!" ఇంగుసు. 11 అత్తుకు ఆ మెనుషు" నన్ను నల్లుకు సేందిక్కురాలు 'నిట చాపా పెచ్చుగుండు నడుదు' పో యిండు నాకు సొన్నుసు" ఇంగుసు. 12 అప్పుడు అయిలు " అసులు నిన్ను నీట పరుపెత్తుగుండు నడు యిండు సొన్నక్కిరుదు ఎదు?" యిండు అత్తును కేటుసు. 13 అత్తుకు నన్ను నల్లుకు సేందిక్కురు ఎదో నాకు గొర్తుల్లా. ఎందాతుకు ఇండిగా అటి జానాంగులు సానా మంది ఇంచు కాబట్టి యేసు నిమ్మలంగా వెళ్లిపోసు. 14 మళ్ళీ యేసు దేవాలయం కోరు అత్తును పాకుసు. "పారు, నీకు నల్లుకు అకి. ఇప్పుడు పాపం చెందిగా నీకు ఇంకా ఎక్కువా కీడు కలుగాదు. అత్తుకే ఇక పాపం చెయ్యి మాన." యిండు అదోటి సొన్నుసు. 15 అదు యూదా నాయకులచ్చుకు ఓయి నన్ను నల్లుకు సేందిక్కురుదు యేసు యిండు సొన్నుసు. 16 ఈ పనులడ్డి యేసు విశ్రాంతి దినాన సేందికి కాబట్టి యూదులు ఆయనను బాధించుసు. 17 యేసు అయిలోటి, "నా తండ్రి ఇప్పుడు కూడా పని సెయ్యకుదు నాను కూడా సెయ్యక్కిరి" ఇంగుసు. 18 ఆయన విశ్రాంతి దినాచారామును భంగం సెయ్యుదు అల్లాదే దేవురును తండ్రి యిండు సొన్ని తనను దేవురుకు సమణునిగా సేందుగక్కుదు అయిలు ఆయనను కొడ్రోడసికిండు ఇంక్క ఎక్కువ ప్రయత్నం సేందుసు. 19 కాబట్టి యేసు అయిలికి ఇనుగు జవాబు సొన్నుసు. "నింగులొటి ఖచ్చితంగా సొన్నక్కిరి. మగును తనంతట తాను ఎందాతు సెయ్యిమాదు. తండ్రి ఎందాత సెయ్యురుదు పాకాదో మగును అత్తె సెయ్యాదు . ఎందాతుకు ఇండిగా తండ్రి ఎందాత సెయ్యాదో ఆత్తే మగును సెయ్యాదు. 20 తండ్రి మగును ప్రేమించక్కు కాబట్టి తాను సెయ్యురు పనులడ్డి మగును పాకక్కుదు. అంతును మాత్రమే అల్ల. ఆయన నింగులాడ్డేరుకు విబ్రాంతి కలిగిత్తుకు ఇంతున కంటే గొప్ప సంగతులు మగును కాటిక్యాదు. 21 తండ్రి సొత్తోఇక్కిరాయలును ప్రాణము కుడుతు ఎనుగు ఎద్దుపిక్కుసో అణిగే మగును కూడా తనకు ఇష్టము ఇక్కిరాయిలును పెపిక్కదు. 22 తండ్రి ఎత్తుకు తీర్పు తీర్చుమాదు కానీ అడ్డేరుకు తీర్పు తీర్చురు సమస్త అధికారం ఆయన మగును కు కుడుతుకిదు. 23 ఇనుగు తండ్రిని గౌరవించి తీరీ ఆనిగే అడ్డేరు మగును కూడా గౌరవించాసికి.మగును గౌరవించారాలు ఆయనను అంప్పుటిక్కురు తండ్రిని కూడా గౌరవించామాదు. 24 ఖచ్చితంగా సొన్నక్కిరి. నట వాతా కేటు నన్ను అంప్పుటిక్కు రాలు మిని నమ్మకం ఇక్కిరాయకి నిత్యజీవం కీదు. అత్తుకు శిక్ష ఇక్కిమాదు. అదు చావు కోరుండు జీవం కోకు దాటుగుండుసు. 25 నింగ్లుకు ఖచ్చితంగా సొన్నక్కిరి . సోత్తోయిక్కిరాయ దేవురు మగునైన నట స్వరం కేకురు సమయం వారాదు. ఇప్పుడు వందుకిదు.ఆ స్వరం కేకురాయ పెకాదు. 26 తండ్రి ఎనగా స్వయంగా జీవం కలిగి కిదో అణిగే మగును కూడా స్వయంగా తనుకోరు జీవం కలిగి ఇక్కిత్తుకు మగునుకు అధికారం కుడుకుసు. 27 అణిగే ఆయన మగునుకు తీర్పు తీర్చురు అధికారం కుడుకుసు.ఎందాతుకు ఇండిగా ఆయన మనుష్య కుమారుడు. 28 ఇత్తుకు నింగులు ఆశ్చర్య బుగుమానంగా. గోరీలుకోరు ఇక్కిరాయ ఆయన స్వరాన్నీ కేకురు కాలం వారాదు. 29 అనుగు కేటిక్కురాయ గడ్లికి వారాదు. నల్లాదు చెందిక్కిరాయ జీవాపు పునరుత్థానముకు చేడు చెందిక్కిరాయ తీర్పు పునురుత్థానముకు గడ్లికి వారాదు. 30 నా అంతట నానే ఎందాతును సెయిమాటి. నాను మిన్ని కేటిక్కిరు ప్రకారంగానే తీర్పు తీర్చాకి. నట సొంత ఇష్టమును నెరవేర్చుగు బేకిండు నాను పాకుమాటి గానీ నన్ను అంపూటిక్కిరాలుట ఇష్టము నెరవేరుబేకిండు పాకాకి. కాబట్టి నట తీర్పు న్యాయముగా ఇక్కాదు. 31 నన్ను గురించే నానే సాక్షము సొన్నుగుండుగా అదు సత్యము అల్లా. 32 నన్ను గురించి సాక్షము సొన్నురాలు ఇంకొండాలు కీదు. నన్ను గురించి ఆయన సొన్నురు సాక్షము సత్యము యిండు నాకు గొర్తు. 33 నింగ్లు యోహానచ్చుకు కొంతమందిన అంపూటంగా. అదు సత్యము గురించి సాక్షము సొన్నుసు. 34 కానీ నాను మొనుసులుట సాక్షమును ఒప్పుగుమాటి గానీ నింగుట రక్షణ కోసం ఈ వాతలను సొన్నక్కిరి. 35 యోహాను మండుగుండు ప్రకాశించురు దీపం తీరి కీదు. నింగ్లు అస ఎలుతురుకో కొంతకాలం సంతోషించిత్తుకు ఇష్టుబుగునంగ. 36 అయితే యోహాను నన్ను గురించి సొన్నిక్కిరు సాక్షము కంటే గొప్ప సాక్షము నాకు కీదు. నాను సాదించిత్తుకు నా తండ్రి నాకు తందిక్కిరు పనులే ఆ సాక్షము. ప్రస్తుతం నాను సేయక్కురు ఈ కార్యాలే తండ్రి నన్ను అంపూటుకీదిండు నన్ను గురించి సాక్షము సొన్నక్కిరి. 37 నన్ను అంపూటిక్కురు తండ్రి తానే నన్ను గురించి సాక్షము సొన్నక్కుదు. ఆయనట స్వరమును నింగ్లు ఏనాడు కేకిల్లా. ఆయన స్వరూపాన్ని ఏనాడు పాకిల్లా. 38 ఆయన అంపూటిక్కురు మొనుసును నింగ్లు నమ్మిల్లా కాబట్టి ఆయన వాక్కు నింగ్లుకోరు నిలుబూగిల్లా. 39 లేఖనాలుకోరు నింగ్లుకు నిత్య జీవం కీదు ఇండుగుండు నింగ్లు అత్తును పరిశోధించక్కురంగా. కానీ అయే నన్ను గురించి సాక్షము సొన్నక్కుదు. 40 అయితే నింగ్లుకు జీవం వార్రు తీరి నన్నచ్చుకు వారిత్తుకు నింగ్లుకు ఇష్టము ఇల్లా. 41 మొనుసులు తార్రు గౌరవమును నాను స్వీకరించుమాటి. 42 ఎందాతుకు ఇండిగా దేవురుట ప్రేమ నింగ్లుకోరు ఇల్లాయిండు నాకు గొర్తు. 43 నాను నా తండ్రి పేరు మేని వందికీరి. నింగ్లు నన్ను అంగీకరించిల్లా. ఇంకొండాలు అస సొంత పేరు ప్రతిష్ఠలోటి నింగ్లచ్చుకు వందిగా నింగ్లు అత్తును అంగీకరించాకంగా. 44 వేరాయచ్చుండు వార్రు మెప్పును అంగీకరించుగుండు ఏకైక దేవరచ్చుండు వార్రు మెప్పును దేవురుమాటారు నింగ్లు ఎన్నగ విశ్వసించాకంగా? 45 నాను తండ్రి మినిగల్లి నింగ్లుమేని నేరము మోపాయకిండు ఇండుగుమానంగా. నింగ్లుమేని నేరము మోపిత్తుకు ఇంకొండు మొనుసు కీదు. నింగ్లు నింగుట ఆశలు అడ్డి ఎచ్చుగుండిక్కిరు మోషేయే నింగ్లుమేని నేరము మోపాదు. 46 నింగ్లు మోషేను నమ్మిందిగా నన్ను కూడా నమ్మాకంగా. ఎందాతుకు ఇండిగా మోషే నన్ను గురించి రాసికీదు. 47 నింగ్లు అదు రాసిక్కితే నమ్మారుదోసా ఇక నట వాతలను ఎన్నగ నమ్మాకంగా?