అధ్యాయము 4

1 యోహాను కన్నా యేసు ఎక్కువ మందిని శిష్యులను సేందుగుండు, అయిలికి బాప్తిస్మము కుడుకుదు పరిసయ్యులు కెటుకిదిండు ప్రభువుకు తెలుజుసు. 2 నిజానికి యేసు బాప్తిస్మము కుడుకిల్లా గానీ ఆయన శిష్యులు కుడుకంచు. 3 ఆప్పుడు ఆయన యూదయ దేశం కోరుండు ప్రయాణం సేందు గలిలయకు ఓసు. 4 ఎగికోరు సమరయ ప్రాంతం గుండా అయన ప్రయాణం సేందుసు. 5 ఆయన సమరయకోరు ఇక్కురు సుఖారు ఇంగురు ఊరుకోకు వంచు. ఈ ఊరుకో దగ్గరికోరు యాకోబు అదుగు మగును యేసేపుకు ఓడ్రోవ్వ భూమిని కుడుకుసు. 6 యాకోబు బావి అటి యించు. ప్రయాణం కోరు అలిసి పోయిన యేసు ఆ బావి దగ్గరకు వందు కొందుగుండుసు. అదు మిట్ట మధ్యాహ్నం. 7 ఒండు సమరయ పొంబుల్లి తాన్ని తొడిగిత్తుకు అబావిచ్చుకు వంచు. యేసు ఆయమ్మేటి "కుడికిత్తుకు తన్ని తారక?" యిండు కేడుసు. 8 ఆయన శిష్యులు తిండి కొండుగిత్తుకు ఊరు కోకుపోసు. 9 ఆ సమరయ పొంబిల్లి యేసుప్రభు ఓటి ఇనుగు ఇంగుసు, "యూదుడివి. సమరయ పొంబిల్లి నన్ను తాన్ని ఏనుగు కేకక్కుర?" ఎందాతుకు ఇండిగా యూదులు సమరయలోటి ఎంతారు సంబంధాలు ఎచ్చుగుమాదు. 10 అత్తుకు యేసు,"నీను దేవురు వరమును, కుడుకుత్తుకు తన్ని బేకిండు నిన్ను కేకురు మెనుషేదో తెలుజుగుండుగా నీనే ఆయననే కేకందా ఆయన నీకు జీవజలం తందు ఇక్కిరాలు" యింగుసు. 11 అప్పుడు ఆ పొంబిల్లి "అయ్యా, ఈ బావి చాలా లోతు. తొడుగిత్తుకు నిన్నచ్చి ఎందాదు ఇల్లే. ఆ జీవజలం నికేనుగు దొరుకాదు? 12 నంబురు తెపుయిన యాకోబు ఈ బావి తాన్ని కుడుకుసు. అస సంతానముకు, అస మాళ్లుకు కుడుకుత్తుకు ఈ తన్నే కుడుకుసు. నంగులుకు కుడుకుత్తుకు ఈ బావినే తంచు. నిను అత్తు కంటే గొప్పలా?" ఇంగుసు. 13 అత్తుకు యేసు "ఈ తన్ని కుడుకురాయ ప్రతి ఒండాలుకు మళ్ళీ తన్ని పెస్సేరాదు 14 నాను తార్రు తన్ని కుడుకురయ ఎప్పటికి తన్ని పెస్తుగుమాదు.నాను అయిలుకు కుడుకురు తన్ని అత్తుకోరు ఒండు తన్ని ఊటగా మారి నిత్యజీవంకోకు ఊరదు"ఇండు సొన్నుసు. 15 అప్పుడు ఆయమ్మ ఆయనోటి, "అయ్యా, తన్ని సేదుగిత్తుకు నాను ఇత్తునా తూరు వారారుగుండా ఆ తన్ని నాకు తా"యిండు కేడుసు. 16 యేసు ఆయామ్మోటి,"నిను పోయి ని మనాగును అసుగుండు ఇటుకు బా"సొన్నుసు. 17 అత్తుకు ఆయమ్మ"నాకు మనాగు ఇల్లా" ఇంగుసు. యేసు ఆయమ్మటి"నాకు మనాగు ఇల్లా యిండు సరిగ్గ నే సొన్నక్కిరా. 18 ఎందాతుకు ఇండిగా నీకు అంజాలు మనగునాయ కీదు. ఇప్పుడు నిన్నచ్చి ఇక్కిరాలు ని మనగు అల్లా. ఇవిషయాము నల్లుకు సోన్నుకిరా యిండు సొన్నుసు. 19 అప్పుడు ఆ పొమ్మిల్లి "అయ్యా, నీను ఒండు ప్రవక్త యిండు నాకు అర్థమాగక్కుదు. 20 నంగుట పూర్వము ఇక్కిరాయ ఈ గుట్టు మేని ఆరాదించుసు. కానీ ఆరాధించురు స్థలము యెరూషలేముకోరు కీదిండు అడ్డేరు అటుకు ఓయి ఆరాధించు భేకిండు నింగ్లు ఇంగాకంగా" ఇంగుసు. అత్తుకు యేసు ఇన్నగ సొన్నుసు, 21 "అమ్మా, తండ్రిని ఈ గుట్టు మెనో, యెరూషలేముకోరో ఆరదించుమాటారి కాలము వారాదు. నట వాత నమ్ము. 22 నింగ్లు నింగ్లుకు తెలిమాటార్థు ఆరాదించాకంగా. నంగ్లు నంగ్లు కు తెలిజిక్కిత ఆరాదించాకో. ఎందాతుకు ఇండిగా రక్షణ యూదులుకోరుండే వారాదు. 23 తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మోటి సత్యమోటి ఆరాధించురు కాలము వారాదు. ఇప్పుడే వందికీదు. అత్తారాయో అత్తును ఆరాధించు భేకిండు తండ్రి పాకక్కుదు. 24 దేవురు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించురాయ ఆత్మోటి, సత్యమోటి ఆరాధించు భేకు." 25 అప్పుడు ఆ పొమ్మిల్లి ఆయనోటి, "క్రీస్తు యిండు కూడురు మెస్సియా వారక్కుదిండు నాకు గొర్తు. ఆయన వందప్పుడు నంగ్లుకు సమస్తము వివరించాదు" ఇంగుసు. 26 అత్తు కేటు యేసు "నిన్నోటి వాచ్చక్కురాయలును నానే ఆయనను" యిండు సొన్నుసు. 27 ఆ సమయముకోరే ఆయన శిష్యులు తిరిగి వంచు. ఆ పొమ్మిల్లోటి ఆయన వాచ్చురుదు పాతు 'ఎందాతుకు వాచ్చక్కుదు' ఇండుగుంచు. కానీ 'నీకు ఎందాదు భేకు' గాని 'ఆ యమ్మోటి ఎందాతుకు వాచ్చక్కర' యిండు గానీ ఏదు కేకిల్లా. 28 ఆ పొమ్మిల్లి అస తన్ని కుండ అటే ఉట్టూటు ఊరుకోకు ఓసు. 29 ఆ ఊరుకోరిక్కిరాయోటి, "నింగ్లు నన్నోటి వందు నాను సేందిక్కిరు పనులు అడ్డి నన్నోటి సొన్నిక్కురు మొనుసును పారంగో. ఈయన క్రీస్తు అల్యా?" ఇంగుసు. 30 అయిలు అడ్డేరు ఊరును ఉట్టూటు ఆయనచ్చుకు వంచు. 31 శిష్యులు "బోధకుడా, కలి తిను" యిండు ఆయనను బతిమలాడుసు. 32 అత్తుకు ఆయన, "తింగిత్తుకు నింగ్లుకు తెలిమాటారు ఆహారము నాకు కీదు" యిండు అయిలోటి సొన్నుసు. 33 "ఆయన తింగిత్తుకు ఏదన్నా కలి ఎత్తేరక్కదా? యిండు శిష్యులు ఒండాలోటి ఒండాలు సొన్నుగుండుసు. 34 యేసు అయిలున పాతు "నన్ను అంపూటిక్కిరాలుట ఇష్టం సేయిదు, ఆయనట పని సేందు ముగించుదే నట ఆహారము. 35 పంట అరికిత్తుకు కోతకాలము వారుభేకిండిగా ఇంకా నాలు మాద్దు కీదిండు నింగ్లు సొన్నాకంగా! నింగుట తలపెచ్చి కొల్లంగులును పారంగో. అవి ఇప్పటికే పంట ఆకీదిండు అరికిత్తుకు సిద్ధంగా కీదిండు నింగ్లోటి సొన్నక్కిరి. 36 విత్తనాలు సల్లురాలు పంటను అరుకురాలు కలసి సంతోషించురుతీరి అరుకురాలు జీతము వంకుండు శాశ్వత జీవం కోసం ఫలమును సమకూర్చుగక్కుదు. 37 ఈ విషయముకోరు విత్తనాలు సల్లురుదు ఒండాలు, పంట అరుకుదు ఇంకొండాలు ఇంగురు వాత నిజమే. 38 నింగ్లు ఏత్తు కోసం ప్రయాస బుగిల్లో అత్తును అరికిత్తుకు నింగ్లున అంపూటి. వేరాయ శ్రమించుసు, అయిలుట శ్రమ ఫలమును నింగ్లు అనుభవించక్కురంగా" యిండు ఇంగుసు. 39 'నాను సేందిక్కుదడ్డి ఆయన నన్నోటి సొన్ను సు' యిండు సాక్షము సొన్నిక్కిరు ఆ పొమ్మిల్లిట వాత ను పుడుసు ఆ ఊరికోరిక్కురు సమరయులు అడ్డేరు ఆయన కోరు విశ్వా సము ఎక్కిసు. 40 ఆ సమరయులు ఆయ నచ్చుకు వందు అయలచ్చి ఇరు యిండు ఆయనను వేడు గుంచు. కాబట్టి ఆయన అటి రెండు దినాంగులు ఇంచు. 41 ఆయనట వాతులు కేటు ఇంకా అడ్డేరు ఆయనకోరు విశ్వాసము ఎక్కిసు. అయిలు ఆ పొమ్మిలోటి, "నంగ్లు విశ్వాసము ఎచ్చిక్కిదు కేవలము నిట వాతు మేనే అల్లా. 42 నంగ్లు కూడా ఆయనట వాతులు కేటో. ఇప్పుడు ఈయన నిజంగా ఈ లోక రక్షకుడు యిండు తెలుజుగుండు కీరో" ఇంగుసు. 43 రెండు దినాంగులు అయిపోయినప్పుడు ఆయన గలిలయకు ప్రయాణమాయి ఓసు. 44 ఎందాతుకు ఇండిగా ఏ ప్రవక్త అస స్వదేశముకోరు గౌరవము పొందుగుమాదిండు ఆయనే స్వయంగా ప్రకటించుసు. 45 ఆయన గలిలయకు వందప్పుడు గలిలయులు ఆయనకు స్వాగతము పలుకుసు. పండగ ఆచరించిత్తు కోసం గలిలయులు కూడా యెరూషలేముకు ఓక్కుదు. అటి ఆయన సేందిక్కురు పనులు అడ్డిన అయిలు పాకుసు. 46 యేసు గలిలయకోరు కానా ఇంగురు ఊరుకు వంచు. ఆయన తన్నిను ద్రాక్షారసంగా మార్చిక్కిదు ఇటే. అదే సమయముకోరు కపెర్నహూముకో ఒండు రాజ వంశానికి సెందిక్కురు ఒండు అధికారి మగుకు జబ్బు సేందుకీదు. 47 యేసు యూదయ కోరుండు గలిలయకు వందికీదిండు అదు కేకుసు. ఆయనచ్చుకు ఓసు. అదుగు మగు సొత్తోగిత్తుకు సిద్ధంగా కీదిండు వందు నల్లక సేయిబేకిండు ఆయనను వేడుగుంచు. 48 యేసు అదోటి ఇన్నగ ఇంగుసు, "సూచనలు అద్భుతాలు పాకాదిందిగా నింగ్లు నమ్మనే నమ్మమాటంగా. 49 "అత్తుకు అధికారి, "ప్రభువా, నమ్మగు సోత్తోగార్ధుకు మిన్నే భా" యిండు వేడుగుంచు. 50 యేసు అదోటి " నీను ఫో. నిమ్మగు పెగిసే కీదు" యిండు సొన్నుసు. 51 అదు ఎగికోరు ఇక్కిరప్పుడే అస సేవకులు ఎదురు వంచు. అదుగు మగు పెగిసి కీదిండు తెలిజేందుసు. 52 "ఏ సమయముకోరు అదు నల్లకాసు"యిండు అదు అయిలున కేకుసు. అయిలు, "నేసు ఒండు గంటకు జర తగ్గురుదు మొదులాసు" యిండు సొన్నుసు. 53 'నిమ్మగు పెగిసే కీదు' యిండు యేసు అదోటి సొన్నిక్కిరు సమయం సరిగ్గా అదే యిండు అదు తెలుజుగుంచు. కాబట్టి అదు, అస ఊటుకోరిక్కురాయ అడ్డేరు నమ్ముసు. 54 ఇన్నగా యేసు యూదయకోరుండు గలిలయకు వందు సేందిక్కురు రెండవ సూచకక్రియ.