1 శారాములుగా ఉన్న మీరు మీ భర్తలకు కచ్చితంగా లోబడాలి .అందుకని కరవోల్లలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైనా సరే ,నాగనులతో కాకుండా ,కరవోళ్ళ 2 శారా౦ ల ప్రవర్తనే కరవోల్లని ప్రభువు కోసం సంపాదిస్తుంది .ఎందుకంటే గౌరవంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన కరవోళ్ళు చూసి ఉంటారు . 3 బాహ్య అల౦కారాలు ,జడలు అల్లుకోవడం ,సువర్ణ ఆభరణాలు ,ఖరీదైన బట్టలు ,అనేవి తమకు వద్దు .అటువంటి వాటికి 4 బదులుగా,మదిలో శా౦తం ,సాత్విక స్వభావం పొంది ఉండండి .అటువంటి అలంకారం నాశనం కాదు .అది ముత్తని దృష్టికి గొప్ప విలువైనది . 5 పూర్వకాలంలో ముత్తని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు .కరవోల్లు తమ పతులకు లోబడి ఉ౦టూ వాళ్ళని వాళ్ళు అలంకరించుకున్నారు 6 .ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది .మీరు యే అలుకువలకూ లొంగకుండా ,మేలు చేస్తూ ఉంటే ,ఇప్పుడు ఆమె పిల్లలవుతారు . 7 ఆలాగనే పతులైన మీరు ,జీవితమనే బహుమానంలో మీ శారా౦లు మీతో కూడా వాటాదారులని గ్రహించి ,కరవోల్లు అబలలని తెలిసికొని వారితో కాపురం చేయండి .ఇలా చేస్తే మీ పార్థనలకు ఆటకం కలుగదు 8 ఆకరికి మీర౦దరూ మనస్సులు కలిసి ,కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకు౦టూ ,సున్నిత హృదయంతో వినయం తో ఉండండి .కీడుకు బదులుగా 9 కీడు చేయవద్దు .అవమానానికి బదులుగా అవమాని౦చవద్దు .దానికి బదులుగా దీవిస్తూ ఉండండి .ఎందుకనగా మీరు దీవెనలకు వారసులు అయ్యే౦దుకే ముత్తడు మిమ్మల్ని పిలిచాడు . 10 జీవాన్ని ఇష్టపడి మేలు దినాలు చూడాలని కోరే వాడు చెడ్డ నగనులు పలకకుండా తన నాలుకను మోసపు నగనులు చెప్పకు౦డా తన పెదవులని 11 కాచుకోవాలి .పంతుగాడు చెడు మానుకొని మంచి చేయాలి .శాంతిని వెదకి అనుసరించాలి 12 .ప్రభువు నయనాలు నీతి మంతుల మీద ఉంటాయి.ఆయన చెవులు కరవోళ్ళ ప్రార్థనలు వింటాయి .అయితే ప్రభువు మోము ,చెడు చేసేవారికి విరోధంగా ఉంది . 13 తమరు మంచి దర్యాభులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడేవాడు ?మీరు ఒకవేళ నీతి కొరకు బాధ 14 అనుభవించినా మీరు ధన్యులే .కరవోల్లు అలుకువపడే వారికి మీరు అలుకువ పడోద్దు.కలవారపడొద్దు . 15 అందుకు బదులుగా ,మీ మనస్సులలో క్రీస్తూను ప్రభువుగా ప్రతిష్టించండి .ముత్తనిలో మీకెందుకు అంత నమ్మకం అని అడిగే ప్రతివానికీ సాత్వికంతో 16 వినయంతో సమాధానం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి .మంచిదైన మనస్సాక్షి పొంది ఉండండి .అప్పుడు ప్రభువులో మీకున్న మంచి జీవితాన్ని అవమానించే కరవోల్లు సిగ్గుపడుతారు.ఎందుకనగా మీరు చెడు వారు 17 అన్నట్టుగా మీకు వ్యతిరేకంగా కరవోల్లు నగనుతున్నారు .కీడు చేసి బాధ పడడం కంటే మంచి చేసి బాధ పడడాన్ని ముత్తడు అనుమతిస్తే ,అదే చాలా మంచిది .క్రీస్తు ఆత్మ నోవహు దినాల్లో ప్రకటించడం . 18 క్రీస్తు కుడా పాపాల కొరకు ఒక్కసారే కరిసిపోయాడు .మనల్ని ముత్తని వద్ధకు తీసుకు రావడానికి ,దోషులమైన మన కొరకు నీతిమంతుడైన ప్రభువు కరిసిపోయాడు .ఆయన్ని సారీరకంగా కరించారు గానీ 19 ముత్తని ఆత్మ ఆయనను బతికి౦చాడు .ఇప్పుడు చెరసాలలో ఉన్న ఆత్మల వద్దకు ,ఆయన ఆత్మరూపిగా వెళ్లి ప్రకటించాడు .ఆ ఆత్మలు ముత్తనికి విధేయత చూపలేదు .పూర్వం నోవహు 20 దినాల్లో ఓడ తయారవుతూ ఉంటే ముత్తడు దీర్ఘ శా౦తంతో కనిపెట్టిన ఆ దినాల్లో ,ఆ ఓడలో కొంచం మందినే, అంటే ఎనిమిది మంది నే,ముత్తడు నీటి ద్వారా రక్షించాడు . 21 దానికి సాదృస్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంది .అది శరీరం మీద మురికి వదిలించుకున్నట్లు కాదు ,అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా 22 ముత్తని పట్ల మంచి మనస్సాక్షి నుంచి వచ్చే అభ్యర్దనే.ఆయన పరలోకానికి వెళ్ళాడు .ముత్తని కుడివైపున ఉన్నాడు .దూతలు ,అధికారులూ ,అధికారాలు ,అన్నీ ఆయనకు లోబడాలి .