Matthew 26

Matthew 26:1

ఏ యూదుల పండుగ రెండు రోజుల్లో రాబోతున్నదని యేసు చెప్పాడు?

పస్కా పండుగ రెండు రోజుల్లో రాబోతున్నదని యేసు చెప్పాడు (26:2).

Matthew 26:3

యాజకులు, పెద్దలు ప్రధాన యాజకుని మందిరములో సమకూడి ఏమని ఆలోచన చేశారు?

వారు యేసును మాయోపాయము చేత పట్టుకొని ఆయనను చంపాలని ఆలోచన చేశారు (26:4).

ప్రధాన యాజకులు, పెద్దలు ఎందువలన భయపడ్డారు?

పండుగ సందర్భంగా యేసుని చంపితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వారు భయపడ్డారు (26:5).

Matthew 26:6

ఒక స్త్రీ విలువైన అత్తరును యేసు తలపై పోసినప్పుడు శిష్యులు ఏమనుకున్నారు?

శిష్యులు కోపగించుకోని ఆ అత్తరును అమ్మి వచ్చిన ధనం పేదలకు పంచవచ్చు గదా అన్నారు (26:6-9).

Matthew 26:12

తన తలపై ఆ స్త్రీ నూనె పోసినప్పుడు యేసు ఏమని చెప్పాడు?

నా భూస్థాపన కొరకు ఈమె ఈ అత్తరు పోసినదని యేసు చెప్పాడు (26:12).

Matthew 26:14

యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు ప్రధాన యాజకులు ఎంత మొత్తం చెల్లించారు?

యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు ప్రధాన యాజకులు ముప్ఫై వెండి నాణెములు చెల్లించారు (26:14-15).

Matthew 26:23

తనను అప్పగింపబోయేవానికి భవిషత్తులో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

తనను అప్పగింపబోయే వాడికి బాధ, వాడు పుట్టకుండా ఉన్నట్టయితే అతనికి మేలు అని యేసు అన్నాడు (26:24).

యేసును అప్పగింపబోయేది నేనా అని యూదా అడిగినప్పుడు యేసు ఏమని జవాబిచ్చాడు?

"నీవన్నట్టే" అని యేసు జవాబిచ్చాడు (26:25).

Matthew 26:26

యేసు రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి, విరిచి శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?

"దీనిని తీసికొని తినండి, ఇది నా శరీరము" అని చెప్పాడు (26:26).

Matthew 26:27

యేసు గిన్నె తీసుకొని దానిని శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?

"ఇది నా రక్తము, అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము" అని చెప్పాడు (26:28).

Matthew 26:30

యేసు తన శిష్యులతో ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు వారితో ఏమని చెప్పాడు?

ఆ రాత్రి వారంతా తన విషయంలో అభ్యంతరపడతారని యేసు చెప్పాడు (26:30-31).

Matthew 26:33

పేతురు యేసు విషయంలో అభ్యంతరపడనని యేసుతో చెప్పినప్పుడు ఆయన పేతురుతో ఏమని చెప్పాడు?

పేతురు ఈ రాత్రి కోడి కూయక ముందు తనను ఎరుగనని మూడుసార్లు చెబుతాడని యేసు చెప్పాడు (26:33-34).

Matthew 26:36

తాను ప్రార్ధించే సమయంలో పేతురు, జెబెదయి ఇద్దరు కుమారులను ఏమి చేయమని యేసు అడిగాడు?

శిష్యులను మెలకువగా ఉండి కనిపెట్టమని యేసు కోరాడు (26:37-38).

Matthew 26:39

ప్రార్థనలో యేసు తండ్రిని ఏమి అడిగాడు?

సాధ్యమైతే ఈ గిన్నెను నానుండి తొలగిపోనిమ్ము అని ప్రార్ధించాడు (26:39).

యేసు తన చిత్తం కాక, ఎవరి చిత్తం నెరవేరాలని కోరాడు?

యేసు, తన చిత్తం కాక తండ్రి చిత్తమే నెరవేరాలని కోరాడు (26:39,42).

Matthew 26:42

యేసు ప్రార్ధించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు ఏమి చేస్తున్నారు?

యేసు ప్రార్ధించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు (26:40,43,45).

ఎన్నిసార్లు యేసు శిష్యులను విడిచి ప్రార్ధించడానికి వెళ్ళాడు?

యేసు శిష్యులను విడిచి మూడుసార్లు ప్రార్ధించడానికి వెళ్ళాడు? (26:39-44).

Matthew 26:47

గుంపులో ఉన్న యేసును బంధించడానికి యూదా ఏ సూచన చెప్పాడు?

గుంపులో ఉన్న యేసును ముద్దు పెట్టుకోవడం అనే సూచనను బట్టి ఆయనే యేసు అని గుర్తించాలని యూదా చెప్పాడు (26:47-50).

Matthew 26:51

యేసును బంధించినప్పుడు శిష్యులు ఏమి చేశారు?

యేసు శిష్యులలో ఒకడు కత్తితో ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికివేశాడు (26:51).

యేసు కోరుకుంటే తనను తాను కాపాడుకోలేడా?

యేసు తన తండ్రిని కోరితే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సేనలను తండ్రి పంపుతాడని యేసు చెప్పాడు (26:53).

లేఖనాలు ఏ సంఘటనలవల్ల నేరవేరబడాలని యేసు చెప్పాడు?

జరుగుతున్నఈ సంఘటనలన్నీ లేఖానాల నెరవేర్పు అని యేసు చెప్పాడు (26:54,56).

Matthew 26:55

అప్పుడు శిష్యులు ఏమి చేశారు?

శిష్యులు అందరూ యేసును విడిచి పారిపోయారు (26:56).

Matthew 26:59

యేసుకు మరణ శిక్ష విధించేలా చేయాలని ప్రధాన యాజకులు, మహాసభవారు ఏమి కుట్రలు చేస్తున్నారు?

ఆయనను చంపాలని యేసుకు వ్యతిరేకంగా ప్రజలచే అబద్ధ సాక్ష్యం చెప్పించాలని చూస్తున్నారు (26:59).

Matthew 26:62

జీవము గల దేవుని సాక్ష్యంగా ఏమి చెప్పాలని ప్రధాన యాజకుడు ఆజ్ఞాపించాడు?

ప్రధాన యాజకుడు యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట తమతో చెప్పమని ఆజ్ఞాపించాడు (26:63).

ప్రధాన యాజకుని ఆజ్ఞకు ఏమని జవాబిచ్చాడు?

యేసు, "నీవు చెప్పినట్టే" అని జవాబిచ్చాడు (26:64).

ప్రధాన యాజకుడు ఏమి చూస్తాడని యేసు చెప్పాడు?

మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం ప్రధాన యాజకుడు చూస్తాడని యేసు చెప్పాడు (26:64).

Matthew 26:65

ప్రధాన యాజకుడు యేసుపై ఏమని నేరారోపణ చేశాడు?

యేసు దైవదూషణ చేస్తున్నాడని ప్రధాన యాజకుడు యేసుపై నేరారోపణ చేశాడు (26:65).

Matthew 26:67

యేసుపై నేరం ఆరోపించినపుడు వారు ఏమి చేశారు?

వారు యేసు ముఖంపై ఉమ్మివేసి, గుద్ది, అరచేతులతో కొట్టారు (26:67).

Matthew 26:69

ఒకప్పుడు యేసుతో కలసి ఉన్న పేతురును, నువ్వు యేసు శిష్యుడివి కదా, అని అక్కడి వారు అడిగిన మూడుసార్లు పేతురు ఏమని చెప్పాడు.

యేసు ఎవరో తనకు తెలియదని పేతురు చెప్పాడు (26:70,72,74).

Matthew 26:73

మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే ఏమి జరిగింది?

మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే కోడి కూసింది (26:74).

మూడవసారి జవాబిచ్చిన తరువాత పేతురుకు ఏమి జ్ఞాపకం వచ్చింది?

తనను ఎరుగనని మూడుసార్లు పలికిన తర్వాతే కోడి కూస్తుందని యేసు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు (26:75).