Matthew 25

Matthew 25:1

బుద్ధి లేని కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేముందు ఏమి చేయలేదు?

బుద్ధి లేని కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేముందు తమ దివిటీలలో నూనె తీసుకు వెళ్ళలేదు (25:3).

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే ముందు ఏమి చేశారు?

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే ముందు తమ దివిటీలలో సరిపడిన నూనె తీసుకు వెళ్లారు (25:4).

Matthew 25:5

పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు? అది అనుకొన్న సమయమేనా?

పెండ్లి కుమారుడు అనుకొన్నసమయం కంటే ఆలస్యంగాఅర్థరాత్రి సమయంలో వచ్చాడు (25:5-6).

Matthew 25:10

పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి గల కన్యలు ఏమి చేశారు?

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారునీతో కలసి పెండ్లి విందుకు వెళ్లారు (25:10).

పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధిలేని కన్యలకు ఏమి జరిగింది?

బుద్ధిలేని కన్యలు నూనె కొనేందుకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి విందు తలుపులు మోయబడ్డాయి (25:8-12).

కన్యకల ఉపమానం నుండి విశ్వాసులు ఏమి నేర్చుకోవాలని యేసు కోరుకున్నాడు?

ఆ దినమైనా, సమయమైనా తెలియదు గనుక విశ్వాసులు మెలకువగా, సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (25:13).

Matthew 25:14

యజమాని ఊరు విడిచి వెళ్తూ, తన ఇద్దరు సేవకులకు ఇచ్చిన అయిదు, రెండు తలాంతులను వారు ఏమి చేశారు?

అయిదు తలాంతులు పొందినవాడు అదనంగా మరో అయిదు తలాంతులు సంపాదించాడు. రెండు తలాంతులు పొందినవాడు అదనంగా మరో రెండు తలాంతులు సంపాదించాడు (25:16-17).

Matthew 25:17

యజమాని ఊరు విడిచి వెళ్తూ, ఒక సేవకునికి ఇచ్చిన ఒక్క తలాంతును అతడు ఏమి చేశాడు?

అతడు ఒక గొయ్యి తవ్వి యజమాని ఇచ్చిన తలాంతును దాచిపెట్టాడు (25:18).

Matthew 25:19

యజమాని ఎంతకాలం వరకు తిరిగి రాలేదు?

యజమాని చాలాకాలం వరకు తిరిగి రాలేదు (25:19).

అయిదు, రెండు తలాంతులు తీసుకొన్న సేవకులతో యజమాని ఏమని చెప్పాడు?

యజమాని వారితో, "భళా నమ్మకమైన మంచి దాసుడా" అని మెచ్చుకొని వారిని అనేకమైన వాటిపై నియమించాడు (25:20-23).

Matthew 25:26

ఒక్క తలాంతు తీసుకొన్న సేవకునితో యజమాని ఏమన్నాడు?

యజమాని ఆ సేవకుణ్ణి "సోమరివైన చెడ్డ దాసుడా" అని చెప్పి అతని వద్దనుండి ఒక్క తలాంతు తీసి వేసి, అతణ్ణి చీకటిలోకి విసరివేయమని చెప్పాడు (25:24-30).

Matthew 25:31

మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని ఏమి చేస్తాడు?

మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని సమస్త జనులను పోగుచేసి ఒకరినుండి ఒకరిని వేరుపరుస్తాడు (25:31-32).

Matthew 25:34

రాజు కుడి పక్కన ఉన్నవారు ఏమి పొందుతారు?

రాజు కుడిపక్కన ఉన్నవారు లోకం పుట్టినది మొదలు తమ కోసం సిద్దపరచబడిన రాజ్యం పొందుతారు (25:34).

రాజు కుడిపక్కన ఉన్నవారు తమ జీవిత కాలంలో ఏమి చేశారు?

రాజు కుడిపక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు, దాహం ఉన్నవారి దాహం తీర్చారు, పరదేశులను ఆదరించారు, బట్టలు లేనివారికి బట్టలిచ్చారు, రోగులను పరామర్శించారు, ఖైదీలను దర్శించారు (25:35-40).

Matthew 25:41

రాజు ఎడమ పక్కన ఉన్నవారు ఏమి పొందుకుంటారు?

రాజు కుడి పక్కన ఉన్నవారు అపవాదికి, వాడి దూతలకు సిద్దపరచబడిన నిత్యాగ్నిలోకి పడద్రోయబడతారు (25:41).

Matthew 25:44

రాజు ఎడమ పక్కన ఉన్నవారు తమ జీవిత కాలంలో ఏ పనులు చేయలేదు?

రాజు ఎడమ పక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టలేదు, దాహం గొన్నవారి దప్పిక తీర్చలేదు, పరదేశులను ఆదరించలేదు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వలేదు, రోగులను పరామర్శించలేదు, ఖైదీలను దర్శించలేదు (25:42-45).