Matthew 17

Matthew 17:1

యేసుతో కలసి ఎత్తయిన కొండ పైకి ఎవరు వెళ్లారు?

పేతురు, యాకోబు అతని సహోదరుడైన యోహాను యేసుతో కలసి వెళ్లారు (17:1).

కొండపైన యేసు ఎలా కనిపించాడు?

యేసు ముఖము సూర్యునివలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివయ్యాయి (17:2).

Matthew 17:3

యేసుతో మాట్లాడడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు?

మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడడానికి ప్రత్యక్షమయ్యారు (17:3).

పేతురు ఏమి చేద్దామని అన్నాడు?

వారు ముగ్గురికీ మూడు కుటీరాలు నిర్మిద్దామని పేతురు అన్నాడు (17:4).

Matthew 17:5

ప్రకాశవంతమైన మేఘమునుండి ఏమని వినిపించింది?

ప్రకాశవంతమైన మేఘము నుండి, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి" అన్న మాటలు వినిపించాయి (17:5).

Matthew 17:9

వారు కొండ దిగి వస్తున్నప్పుడు యేసు శిష్యులకు ఏమని ఆజ్ఞాపించాడు?

మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేచే వరకు ఈ దర్శనము ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు (17:9).

Matthew 17:11

లేఖనాల ప్రకారం ఏలీయా ముందుగా వచ్చే విషయం గూర్చి యేసు ఏమి చెప్పాడు?

లేఖనాల ప్రకారం ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెడతాడని యేసు చెప్పాడు (17:11).

ఏలీయా ముందుగానే వచ్చిన సంగతి, మనుషులు అతనికి ఏమి చేసారో ఆ సంగతి గురించి యేసు ఏమి చెప్పాడు?

ఏలీయా బాప్తిసమిచ్చే యోహానుగా ఇదివరకే వచ్చినప్పుడు మనుషులు అతనిని తెలుసుకోక, వారి ఇష్టం వచ్చినట్టు అతని పట్ల చేశారు అని యేసు చెప్పాడు (17:10-13).

Matthew 17:14

శిష్యులు చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి స్వస్థ పరచ గలిగారా?

శిష్యులు చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి స్వస్థ పరచ లేకపోయారు (17:14-16).

Matthew 17:17

చాంద్ర రోగం ఉన్న బాలునికి యేసు ఏమి చేశాడు?

యేసు అతనిలో ఉన్న దయ్యాన్ని గద్దించాడు. ఆ గంటలోనే ఆ బాలుడు స్వస్థత పొందాడు (17:18).

Matthew 17:19

చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి శిష్యులు ఎందుకు స్వస్థ పరచ లేకపోయారు?

తమకున్న అల్ప విశ్వాసం వల్లనే బాలుణ్ణి శిష్యులు స్వస్థ పరచ లేకపోయారని యేసు చెప్పాడు (17:20).

Matthew 17:22

శిష్యులు విచారగ్రస్తులయ్యేలా యేసు చెప్పిన విషయం ఏమిటి?

యేసు తన శిష్యులతో తనను చంపే వారికీ తనను అప్పగిస్తారని, వారు తనను చంపుతారని, మూడవ రోజున తిరిగి లేస్తానని చెప్పినప్పుడు శిష్యులు విచారగ్రస్తులయ్యారు (17:22-23).

Matthew 17:26

పేతురు, యేసు తమ పన్నులు చెరొక అర షెకెలు ఎలా చెల్లించారు?

పేతురును సముద్రమునకు వెళ్లి, గాలం వేసి మొదటగా వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచి అక్కడ దొరికిన ఒక షెకెలుతో ఇద్దరి పన్ను కట్టాలని యేసు పేతురుతో చెప్పాడు (17:27).