స్వస్థపడిన కుష్టరోగి యాజకుని ఎదుట సాక్ష్యార్ధంగా కనబడాలని దేవాలయానికి వెళ్ళమన్నాడు (8:4).
నేను వచ్చి సేవకుణ్ణి స్వస్థపరుస్తానని యేసు చెప్పాడు (8:7).
యేసు తన ఇంటికి వచ్చుటకు తాను అయోగ్యుడనని శతాధిపతి తలంచాడు. యేసు ఒక్క మాట పలికితే తన సేవకుడు బాగుపడతాడని నమ్మాడు (8:8).
ఇశ్రాయేలీయులలో ఎవరిలోనైనా ఇలాంటి విశ్వాసము కనబడలేదని యేసు చెప్పాడు (8:10).
అనేకులు తూర్పు నుండి, పడమర నుండి వచ్చి పరలోక రాజ్యములో భోజనపు బల్ల వద్ద కూర్చుంటారు (8:11).
రాజ్య సంబంధులు చీకటిలోకి త్రోయబడతారని యేసు చెప్పాడు (8:12).
యేసు పేతురు ఇంటిలోకి వెళ్ళినప్పుడు పేతురు అత్తను స్వస్థపరిచాడు (8:14-15).
"ఆయన మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించెనని యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేరింది (8:17).
యేసు తనకు తల వాల్చుకొనుటకు కూడా స్థలము లేదని చెప్పాడు (8:20).
యేసు ఆ శిష్యునితో, తనను వెంబడించమని, మరణించిన వారు మరణించిన వారిని పాతిపెట్టుకోనిమ్మని చెప్పాడు (8:21-22).
సముద్రము మీద తుపాను లేచి పడవ అలలతో కప్పబడినప్పుడు యేసు నిద్రపోతున్నాడు (8:24).
యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, "అల్ప విశ్వాసులారా, ఎందుకు భాధపడుతున్నారు?" (8:26).
యేసుకు గాలీ, సముద్రమూ లోబడుతున్నాయని శిష్యులు ఆశ్చర్యపడ్డారు (8:27).
యేసు దయ్యములు పట్టిన ఇద్దరు ఉగ్రులైన మనుషులను కలుసుకున్నాడు (8:28).
సమయము రాకమునుపే మమ్మును బాధించుటకు వచ్చితివా అని యేసుతో చెప్పాయి (8:29).
యేసు ఆ దయ్యాలను వెళ్ళగొట్టగా, అవి పందుల గుంపులో ప్రవేశించి సముద్రములోకి వేగంగా పరుగెత్తి నీళ్ళలో పడి చనిపోయాయి (8:32).
పట్టణస్థులు తమ ప్రాంతం విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలుకొన్నారు (8:34).