1 2 1.నన్న కేత్తనాద్ బాతితుకు మర్రీన్ తప్పేన్ సంపద అంతవాంకు యజమానుండు అత్తేస్కన్న పిల్లత్ లేగా మత్తచ్చరోజ్కు ఓన్కి దాసునీంకు బే తేడా ఇల్లే. 2.కేత్త రోజు వాదన్ వరకు ఓండు మంచిగాకాపాడనోర, నిర్వకుర్కిన్ అదినంతా మంతోండు. 3 4 5 3.అలాకే మనర్ పిల్లన్లేగా మత్తస్కే లోక సంబందమత్తా మూల పాఠాకింకు లోబర్సి పనివార్కింగా మత్తాము. విశ్వాసి ధర్మశాస్త్రం నుంచి విడుదల పోంత్తోండు. 4.అత్కు మంచి సమయం వత్తస్కే దేవుడ్ ఓని మర్రీను రోత్తోండు.ఓండు నాటవోడ్త్కు పుట్టి, 5.మనార్ దత్తమర్కీరు కావాలిoజో ధర్మశాస్త్రంత్కు లోబర్సి మత్తవోరిన్ విమోచిoచనాంకీ దర్మశాస్త్రంత్కు లోబర్తవాండత్తోండు.విశ్వాసి మర్రినిత్తా పెదేర్తీన్ నిజం తుంగనాదు ఆత్మ. 6 7 6.మీరు మర్కీరు కాబట్టి,''అయ్యా,తప్పే,'' ఇoజో కరగాన్ ఓని మర్రీనాత్మతీన్ దేవుడ్ మన హృదయంతా రోత్తోండు. నిమ్మిక బేమాత్రం పనివాన్ అయ్యో, మర్రీనే.మర్రీనత్కీన్ దేవుడ్ ద్వారా మర్రీను. 7.ధర్మశాస్త్ర పనిగీన్ నాకే గిర్రుడ్డటాం ఇత్కు గిర్రుడ్డి మాముల్ మతంతాకే గిర్రుద్దటాoపే. 8 9 8.ఆ రోజ్కీన్ మీరు దేవుడ్తీన్ తెలియనివార్కింగా, నిజంత్కు దేవుర్కు అయ్యోన్ వారింగా పనివార్కిoగా మత్తోర్ గాని 9.ఇంజే మీరు దేవుడ్తీన్ తెలుసుకుట్టవోరు. ఇంకా విశేషంగా దేవుడ్ మీమిన్ తెలుసుకుట్టోoడు. కాబట్టి,బలహీనమత్తావ్ ప్రయోజనం ఇల్లవవ్ అత్కన్న మూల పాఠాకినాకే మల్లా బారీ గిర్రుడ్డోర్ మిందీరు. మల్లా పనివార్కింగా మందవాలింజోరనుకుండ్జోర్ మిందీరే. 10 11 10.మీరు ప్రత్యేక రోజ్కు అమావాస్య రోజ్కు పండుం రోజ్కింగా సంవత్సరoకింగా జాగ్రత్తగా పాతిసోర్ మందోరు. 11.మీ మాటకీన నా తిప్ప వ్యర్దమాతేబెల ఇంజో మీమిన్ గురించి వేరసోరిమిందాను. 12 13 14 12.తమ్ముల్లారా,నన్న మీలేకన్ వానిన్ అయ్యోను కాబట్టి మీరు కూడా నాలేకన్ వోరు కావాలింజో మీమిన్ కేచ్చోరుమిందాను. 13.మీరు నాకు అన్యాయం తుంగిల్లోరు.మొదటిసార్ ఓల్ద బలహీనత వత్కన్న నన్న మంచిమాట మీకు ప్రకటీస్తానింజో మీకు తెలుసు. 14.అస్కే నా ఓల్దుతా మీకు శోదనగా మత్కన్న దానిన్ పోయిసి నానిన్ మీరు త్రుణికరీసిల్లిరు, నిరాకరీసిల్లీరు గాని దేవున్ దూతలేగా,క్రీస్తుయేసులాగా నానిన్ అంగీకరిస్తోరు.చట్టపరమత్తా మంచీంకు గిర్రుత్తటం ద్వారా గలతీయుర్కు ఓన్ దీవేనాకిన్ పోగొట్టుకుట్టోరు. 15 16 15.మీ కుసేల్ ఇంజే బేలత్తే.వీల్మత్కు మీ కండ్కు తీసి నాకీదాని వారీను మీ గురించి సాక్ష్యం కేత్తాలితాన్. 16.నన్న మీకు నిజం కేచ్చి వేరేవానత్తానా. 17 18 17.వోరు చాలా ఆశతో మీ పెరికే అరసోందోరు,కానీ వోర్ అనుకుండనాద్ మంచిదయ్యో.మీరు వోరిను అనుసరీస్వాలింజో నా నుంచి మీమిన్ దూరం తుంగవాలింజోరనుకుండ్జోoదోర్. 18.నన్న మీ దగ్గర మత్తస్కే మాత్రమే అయ్యకూన్ బెస్కే మంచి కారణాల మాట చాలాశ కలిగి మందటం మంచీదు.ధర్మశాస్త్రం, కృప,ఈ రెండు కలియి మందటం అసాద్యం. 19 20 19.నా చిన్నా పిల్లా,క్రీస్తు రూపం మియా తోపాన్ వరకు మీ మాట మళ్ళ నన్న ప్రసవ వేదన అనుబవీసోర్మిందాను. 20.మీమిన్ గురించి బేకే అలోసిస్కూన్ మిందాను.నన్నింజే మీ మద్యత్ వాసి వేరే లేగా మీతో తిరియవాలింజోరనుకుండ్జోమిందాను. 21 22 23 21.దర్మశాస్త్రంత్కు లోబర్సీ మందవాలింజో కోరనోర్కు, మీరు ధర్మశాస్త్రం కెంజటాం యిల్లీరా.నాతో కేల్లాటు. 22.పనివాన్ వల్ల ఒర్రోండు,స్వతంత్రురాలి వల్ల ఓర్రోండు,ఇరువూరు మర్రీకు అబ్రాహామింకు కలగ్తోరింజో రాసి మందేగదా. 23.అత్కా పనివాన్ వల్ల పుట్తవాండు ఒల్దులెకన్ పుట్తోండు.స్వతంత్రురాలి వల్ల పుట్తవాండు కేత్తలెకన్ పుట్తోండు. 24 25 24.ఈ మాటను అలకార రూపంతే కేత్తోచ్చు.ఈ నాతవోకు రెండు నిబందనలుగా మత్తోరు.వాటినా ఒర్రోట్ సీనాయి పర్వతంత్కు సంబందిస్తా బానిసత్వంతా మందనాంకి పిల్లాని కన్నీతే.ఇద్దు హాగరు. 25.ఈ హాగరు అరేబియా ప్రాంతాతే మత్తా సీనాయి కొండ ఇంజే మత్తా యేరుషలేము దాని పిల్లంతో కూడా బానిసత్వంతే మందే. 26 27 26.అత్కు పోర్రోమందాని యేరుషలేము స్వతంత్రంగా మందే.అద్దు మనాంకు తల్లూర్. 27.''గోడ్రాలా,పిల్లాని కననిదాన,కుసేల్గా మన్ను.ప్రసవ వేదన పర్వనిదాన, కుసేల్తో కేక వాట.బారితుకు,ముత్పల్ మత్త నాటవోడు పిల్ల కంటే ముత్పల్ ఇల్ల దాని పిల్లాకు చాలామంది మందొరు'' యింజో రాసి మందే. 28 29 28.తమ్మలారా,మనార్ కూడా ఇస్సాకు లేగా కేత్తమాట ప్రకారం పుట్తా మర్రీన్గా మందార్. 29.అస్కే ఓల్దీన్ పోయిసి పుట్తవాండు ఆత్మన్ పోయిసి పుట్తవోనిన్ బేల హింసవాట్తోరో ఇంజే కూడా ఆలాగే జరగోందాకు. 30 31 30.లేఖనం బాత కేచ్చోమిందే.''పనివానిను,నాటవొడ్ మర్రీను రోచ్చీం.పనివానిన్ మర్రీ స్వతంత్రురాలి మర్రీన్తో పాటు వారసుడుగా మన్నోండు.'' 31.అందుకే, తమ్ములారా,మనార్ స్వతంత్రురాలిగా మర్రీమే గాని పనివానిన్ మర్రీర్కు అయ్యోం.