Chapter 21

1 కొత్త బూమిఅకాషలు తరువాయ కొత్త ఆకాశాన్ని కొత్త బూమిని సుషను మోదులునీ ఆకాశము మోదులునీ బూమి గతించి పోయా ఎంగ సముద్రము లేదు 2 ఎదికకుండా పరలోకంనింక పరిశుద పట్టణమైన కొత్త హీరుసలేము దేవుడి దేగ్గరినింక దిగి వచేయ్ధాన్ని సుషను అది తన పతికోసం సిధమైన మాధలుగాత్తితర శృంగారించిపడింది 3 ఎదికకుండా సింహాసనం లోపలినింక వచ్చిన మహాధ్వని నాకి వినిపించీ అది ఇగో దేవుడి నివాసము మనుష్యలతో హుంది అతడు వాళ్ళతో వసంషేశేవాడు వాళ్ళు అతుడికి ప్రజలైహుంటారు దేవుడు తానీ వాళ్ళ సంగడము హుంటాడు తిరగ వాళ్ళ దేవుడైహుండదు 4 వాళ్ళ కన్నిలుహంత అతుదేయ్ హరించి ఏడుస్తాడు ఎంగ మరణము హుందేయ్ల్దు ఎంగ దుక్కము కానీ గోలతము కానీ కష్టము కానీ హుందేల్దు మొదులు హున్నిన్దంత హయ అని శోప్పేయ్ 5 అప్పుడు సింహాసనము పైన కోసోనిన్నతను ఇగో నేను అంతని కోతది చేస్తాను అన్నాడు తిరగ ఒక్కడు నాకి నువ్వు దిన్ని రాశి యలన్తేయ్ ఈ మాటలు నమ్మేవి సత్యవధము హైఎంది అని శోప్పినాడు 6 అప్పుడు సింహసను పైన కుసోనిన్నతను అంత నెరవేరింది నేనీ హాది అంత్యము ప్రరంబము సమాప్తము హైహున్నాను దాహము హున్న్వాడికి జివజలము బుగ్గనింక క్రయంలేకుండా తగేయ్దానికి ఇస్తాను 7 జయము పొందేయ్వాడు దినిక్కి బాధ్యుడుహితడు నేను వాడికి దేవుడు హైహుంటాను వాడు నాకి కొడుకైహుంటాడు 8 కాని హేదిలు నమ్మకంలేకున్దేవాళ్ళు అస్సయము హున్నిన్దానికి పలుగారుహైహుంటారు హత్యషేశేవాళ్ళు జారులు మాతగారులు విగ్రహరాదులు అంత సుళ్ళు గరులు విల్లకి శిక్కేయ్ పాలు అగ్గి జ్ఞ్ధకలు హున్న శేరువు అది రెండోవ మరణము అని నాకి శోప్పినాడు కొత్త హీరుసలేము 9 కదా హేడు హుపధ్రవలనింక నిండిన హేడు గిన్నలుని పట్టుకుని హున్న హేడు మంది దేవదుతులో ఒక్కడు వచ్చి న సంగడము మాట్లాడతూ రా గోర్రేపిల్లాతుడికి బర్యకవాల్సిన పిల్లని నికి సుపిస్తాను అని శోప్పి 10 దేవుదిహత్మలో నన్ని హేత్తరమైన పెద్ద కొండకి హేత్తుకొని పొహీ హీరుసలేముహనీ పరిశుద్ధ పట్టణము పరలోకం లోపలినింక దేవుడి దేగ్గరినింక దిగివచేయ్ధన్నీ నాకి సుపించాడు 11 అది దేవుడి తేయ్జస్సు నింక కూడినదీ అమూల్య రత్నము ప్రకశాముకి సమానమైహున్దేయ్ స్వచమిన స్పటికం తార శుబ్రమైహున్దేయ్ 12 ఆ పట్టనముకి హేత్తరమైన పెద్ద గోడ ఉండీ దానికి పన్నెండు వకలిలు ఉండీ ఆ వాకలి దెగ్గర పన్నెండు మంది దేవాదులు హుండ్రి దాని పైన ఎస్రహేలుల పన్నెండు కులాల పేరులు రాశినది 13 పూర్వ దిక్కులో మూడు వకలిలు హుత్తర దిక్కులో మూడు వకలిలు దక్షిణ దిక్కులో మూడు వకలిలు పశ్చిమ దిక్కులో మూడు వకలిలు ఉండీ 14 పట్టణము ప్రాకారానికి పన్నెండు హస్తివారులు ఉండీ దాని పైన యజ్ఞము గోర్రేపిల్లతను పన్నెండు మంది అపోస్తులు పెరేఉలు ఉండీ 15 నా సంగడము మాట్లాడుతున్నవాడు ఆ పట్టణాన్ని దాని వకలిని దాని గోదాన్ని హాలత శేష్దానికి తన చేతులో బంగారు హాలత కత్తిని పట్టిందేయ్ 16 ఆ పట్టణము చాచోవ్కమైహున్దేయ్ దాని పడువు దాని హగాల్ము హంత ఉండీ వాడు ఆ పట్టణాన్ని కట్టినింక హాలత శేషినాడు హలతము సుమారు రెండువేలేన్నురు కిలోమేతెరంత హుండీ దాని పడువు హగాలము హేత్తరము సమముహైహున్దేయ్ 17 వాడు దాని గోడని అలత శేషినాడు అది నోతనలపైఇ నాల్గు మొలహైహున్దేయ్ ఈ లేక్కంలో మనుష్యుడి మొల అంతే దేవదుతిది మొల 18 ఆ గోడ సుర్యకంతము శీలనింక కట్టిన్దేయ్ పట్టణము శుద్దు గాజుతర ఉండీ ఆప్పట బంగారము హైఎన్దెయ్ 19 పట్టణము గోడ అస్తివరాలు సకల విధమైన రాత్నలనింక అలన్క్రుతమిహున్దేయ్ మూదులునీ అస్తివారము సుర్యకంతము షీలా రెండోది నిలమని మూద్దోది పచ్చీ నాల్గోది పద్మరాగము 20 హైదోది గోమేధక ఆరోది మాణిక్యము హేదోది పీతరత్నము హేనిమిదోది బెరుల్ల తోమ్మిదోది పుష్యరాగము పదోది గరుడ పచ్చే పదకొందోదు ఎంధ్రనిల పన్నెందోది నిలస్పతికము 21 పన్నెండు పెద్ధవకలిలు పన్నెండు ముత్తులు హైహున్దేయ్ ప్రతి వాకలి ఒకటొకటి ముత్తునింక చేయ్సిపడింది పట్టణము బీది శుద్ధమైన గాజుతరహున్దేయ్ ఆప్పట బంగారము హైహున్దేయ్ 22 పట్టణంలో నేను దేవాలయాన్ని కనిపించలేదు యలన్తేయ్ సర్వాశాక్తుడైహున్దేయ్ దేవుడైన కర్తుడు యజ్ఞము గోర్రేపిల్లధతుడు దాని ధెవలయముహైఎన్దరుయ్ 23 పట్టనలికి వెలుగు ఎచేయ్కి సూర్యుడు కానీ చంద్రుడు కానీ కావల్సిన్డ్లేదు యలన్తేయ్ దానికి దేవుడి మహిమమీ ప్రకాశాన్ని ఎస్తున్దేయ్ యజ్ఞము గోర్రేపిల్లతుడా దాని హీపము 24 దాని వేలేగునింక జనంగము వాళ్ళు నడిచేయ్వాళ్ళు బూరాజులు తమ వైబవాన్ని దానిలోపలికి తేసుయ్వాళ్ళు 25 దాన్ని పెద్ధవకలిని పగులులో మెచ్చేయ్దేలేదు అడ రాత్రియంతు లేనీ లేదు 26 జనగుల వైబవము గౌరవము ఆడకి తెస్తూ హుంటుంది 27 దాంట్లో ఆశుద్ధమైనది ఒక్కటి శ్రేల్దు అవమానము హైనది కానీ వంచనము కాని చేసేయ్వాడు దానిలోపల ప్రవేశించలేదు కాని యజ్ఞ గోర్రేపిలతుది జివబధ్యులి పుస్తకములో యవరివరొ పేరులు రాశినచాపదిందో వాళ్ళు మాత్రము శేఉతారు