1 యూదేతర నీతి బోధకులు కనుక ఇతరులకు న్యాయం తీర్చే నీవు ఎవరైనా సరే ,నిన్ను నీవు సమర్ది౦చుకోలేవు .వేటి సంగతుల్లో ఎదుటి వారిని తీర్పు తీరుస్తున్నావో దాని 2 విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకు౦టున్నావు .ఎందుకనగా నీవు ఏ దర్యాభుల విషయం లో న్యాయం తీరుస్తున్నవో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా ?ఆ దర్యాభులు చేసేవారి మీద ముత్తని తీర్పు న్యాయమై౦దే అని మనకు ఎరుగు . 3 ఆ దర్యాభులు చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ పంతుగాడ ,ముత్తని తీర్పు నీవెలా తప్పించుకు౦టావు 4 ?ముత్తని కటాక్షం నిన్ను మారు హృదయానికి ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితన౦ అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశా౦తాన్నీ తోసేస్తావా ? 5 నీ మొండితనం ,మార్పురాని నీ మనస్సును బట్టి ,ముత్తని న్యాయమైన 6 తీర్పు జరిగే ఆ ఉగ్రత దినాన ,ముత్తని కోపాన్ని పోగుచేసుకు౦టున్నావు .ఆయన ప్రతిఒక్కరికీ అతని 7 దర్యాభుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు .మంచి దర్యభులను ఓపికగా చేస్తూ ,మహిమ ,ఘనత ,అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు . 8 అయితే స్వార్థపరులు ,నిజమును వదిలిపెట్టి దుర్మార్ఘాన్ని జరిగించే కరవోళ్ళ మీదకి ముత్తని ఉగ్రత ,మహా కోపం వస్తాయి 9 .చెడు దర్యాభు చేసే ప్రతి పంతుగాని ఆత్మకు ,ముందు యూదునికి ,తరువాత యూదేతరునికి ,దుఃఖం, వేదన కలుగుతాయి . 10 అయితే మంచి దర్యాభు చేసే ప్రతి పంతుగానికి ,ముందు యూదునికి ,తరువాత యూదేతరునికి , 11 మహిమ ,ఘనత ,సమాధానం కలుగుతాయి .ముత్తనికి పక్షపాతం లేదు .ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన కరవోల్లు కూడా 12 ధర్మశాస్త్రం లేకున్నా నసిన్చిపోతారు .ధర్మశాస్త్రం ఉంది పాపం చేసినవారు ధర్మశాస్త్ర రీతిగా తీర్పు పొందుతారు . 13 ధర్మశాస్త్రం వినేవారిని కాదు ,దాన్ని వెంబడి ప్రవర్తించేవారినే ముత్తడు నీతిమంతులుగా ఎంచుతాడు .ధర్మశాస్త్రం లేని యూదేతరులు ధర్మశాస్త్ర 14 సంబంధమైన దర్యభులు చేస్తే కరవోల్లకి ధర్మశాస్త్రం లేకపోయినా ,వారికి వారే ధర్మశాస్త్రం లాగా ఉంటారు . 15 అలాంటి కరవోళ్ళ మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది ,కరవోళ్ళ ఆలోచనలు కరవోల్లపై తప్పు మోపదమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి .అటువంటి వారి 16 హృదయాలపై ధర్మశాస్త్ర సారం లిఖి౦చినట్టే ఉంటుంది .నా సువార్త ప్రకారం ముత్తడు యేసు క్రీస్తు ద్వారా పంతుగాళ్ళ రహస్యాలను విచారించే దినాన ఈ విధముగా జరుగుతుంది .ధర్మశాస్త్రం తెలిసిన యూదులకు ధర్మశాస్త్రం ప్రకారమే శిక్ష 17 నీవు యూదుడవాని పేరుపెట్టుకొని ధర్మశాస్త్రం బట్టి ముత్తనిలో అతిశయిస్తున్నావు కదా 18 ?ఆయన చిత్తం తెలిసి ,ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మేలైనదో తెలిసి దానిని మెచ్చుకొంటావు కదా? జ్ఞాన నిజ స్వరూపమైన 19 ధర్మశాస్త్రం కలిగి ,"నేను అందులకు దారకం చూపేవాణ్ణి ,అంధకారం లో ఉండే కరవోల్లకి వెలుగు 20 చూపేవాణ్ణి ,బుద్ధి లేనివారిని చక్కదిద్దే వాణ్ణి , చిన్న చిక్కాసిరపగాళ్ళకి ఉపదేశం చేసేవాణ్ణి "అని నీకు నీవే పిలుచుకు౦టున్నావు కదా ? 21 ఎదుటి పంతుగానికి ఉపదేశి౦చే వాడివి ,నీకు నీవు బోధించుకోవా ?దొంగతనం చేస్తావా ?వ్యభిచారం చేయొద్దని చెప్పే నీవే వ్యభిచార౦ చేస్తావా ? 22 బొమ్మలను అసహ్యి౦చుకు౦టూ నీవు గుడులను దోచుకుంటావా ? 23 ధర్మశాస్త్రం లో బడానగనులు చెప్పుకొనే నీవు ధర్మశాస్త్రం మీరి ,ముత్తనికి అవమానం తెస్తావా ? 24 "మిమ్మును బట్టే గదా ముత్తని పత్రిక యూదేతరుల మధ్య ధూషణ పావుతుంది ?" అని లిఖించి ఉంది కదా . 25 నీవు ధర్మశాస్త్రాన్ని బట్టి నచుకునేవాడివైతే నీకు సున్నతి ఉపయోగకరం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని 26 తోసిపుచ్చే వాడివైతే ,నీ సున్నతి సున్నతి కానట్టే .కనుక సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర పటింపులను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినట్టే గదా ?సున్నతి 27 పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని వెంబడి బ్రతికేవాడు ,లేఖనాలూ , సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా ? 28 బయటకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు ,దేహంలో బయటకు కనిపించే సున్నతి సున్నతి కాదు .అంతరంగం లో 29 యూదుడైన వాడే యూదుడు .సున్నతి మనస్సుకు చెందింది .అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైంది కాదు .అలాంటి కరవోల్లనే మన ముత్తడు నచ్చుతాడు .