1 ప్రధాన కాపరి తిరిగి వచ్చునందువలన క్రైస్తవ సేవ ఎలా ఉండాలి తోటి పెద్ధనూ ,క్రీస్తు బాధలు చూసిన 2 వాణ్ణి,ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగశ్వామినీ అయిన నేను మిమ్మును హెచ్చరిస్తున్నాను .మీ వద్దనున్న ముత్తని మందను కాయoడి .బలవంతంగా కాకుండా 3 ముత్తడు ఇష్టపడేలా ఇష్ట పూర్వకంగా కరవోళ్ళని చూసుకోండి .చెడు లాభం కోరి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి .మీ 4 అజమయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారిగా ఉండకుండా ,మందకు ఆదర్శం గా ఉండండి .ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ,మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది . 5 యవనస్తుల్లారా,మీరు దండి వాళ్లకి లోబడి ఉండండి .మీరంతా ఒకరిపట్ల ఒకరు వినయం కలిగి సేవ చేసుకోండి .ముత్తడు 6 గర్విష్టులని ఎదిరించి వినయం గల వానికి కృప చూపుతాడు .అందుచేత ,ముత్తడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిచెల్లా ఆయన బలిష్టమైన హస్తకోటి కింద మిమ్మల్ని 7 మీరే తగ్గించుకోండి ,ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు ,కనుక మీ ఆందోళన అంత ఆయన మీద వేయండి . 8 నిబ్బరమైన బుద్ధిని కలిగి మెలకువగా నచ్చిoడెoడి .మీ శత్రువైన సాతాను ,గర్జించే సింహం లాగా ఎవరిని కబళించాలా అని 9 వెంబడిస్తూ తిరుగుతున్నాడు .వాడిని ఎదిరించండి .మీ విశ్వాసం లో నిలకడగా ఉండండి .లోకంలో నచ్చెన మీ సోదరులకు కూడా ఇటువంటి బాధలే కలుగుతున్నాయి . 10 తన యొక్క నిత్య మహిమకు క్రిస్తులో మిమ్మునులను పిలిచినటువంటి అపార కరుణానిధి అయిన ముత్తడు,కొద్ది 11 కాలం మీరు బాధ పడిన తరువాత, ప్రభువే మిమ్మును సంపూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు .ఆయనికే ప్రభావం ఎల్లప్పుడు కలుగు గాక .ఆమెన్ . 12 సిల్వాను నా నమ్మకమైన సోదరుడని అనుకొని ,అతని సహాయం తో క్లుప్తంగా లిఖించాను .నేను లిఖిoచిందే ముత్తని నిజమైన కృప అని సాక్షం చెబుతూ ,మిమ్మును 13 హెచ్చరిస్తున్నాను .దీనిలో స్థిరంగా ఉండుడి .బబులోను పట్టణం లో ఉన్న ఆమె ,(మీతో పాటు ముత్తడు ఎన్నుకున్న ఆమె )మీకు అభినందనలు చెబుతున్నారు .నా కుమారుడు మార్కు ,మీకు అభినందనలు 14 చెబుతున్నాడు .ప్రేమ ముద్దుతో ఒకనికి ఒకడు అభినందనలు చెప్పుకోండి .క్రీస్తులో మీకు అందరికి శాంతి కలుగు గాక .