Chapter 1

1 క్రైస్తవ జనులకు వచ్చే కష్టాలు,కరవోళ్ళ ప్రవర్తన యేసు క్రీస్తు అపోస్తలుడగు పేతురు,పొంతు,గలతీయ,కప్పదొకియ,ఆసియా,బితునియ అను చోట్లలో చెదిరిపోయి పరదేశులుగా జీవించుచున్న కరవోళ్ళకి మేలు అని పలికి రాస్తున్నది 2 పితరుడైన ముత్తని బావిష్యాద్ తెలివిని బట్టి ,పరిశుధాత్మ వలన పరిశుద్ధత కలిగి యేసు క్రీస్తుకు విధేయత కనబరుచుటకు ముత్తడు కెంపు ప్రోక్షణ కిందికి వచ్చిన మీపై కృప నిలిచి ఉండును గాక .తమరుకు సమాధానం వచ్చును గాక . 3 మన ప్రభువైన యేసు క్రీస్తు పితరుడైన ముత్తనికి స్తుతులు కలుగు గాక .యేసు క్రీస్తు కరిసిపోయిన తర్వాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా ముత్తడు 4 తన గొప్ప కనికరాన్ని బట్టి మనకు నూతన పుట్టుకనిచ్చాడు .దీని మూలంగా మనకు ఒక వారసత్వం కలిగింది .ఇది నాశనం కాదు 5 ,మరక పడదు ,వాడిపోదు ,ఇది స్వర్గంలో జాగ్రతగా వుండేది .చివరి దినాల్లో వెల్లడి కావడానికి సిద్దంగానున్న రక్షణ కోసం ,విశ్వాసం ద్వారా ముత్తని బాల ప్రభావాలు మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాయి . 6 చాలా రకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు తమరు బాధపడవలసి వచ్చినా తమరు సంతోషిస్తున్నారు .నాశనం అవబోయే బంగారం కంటే 7 విశ్వాసం చాలా విలువైనది .బంగారాన్ని మంటతో శుద్ధి చేస్తారు గదా ! దని కంటే గొప్పదైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచి ,యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది . 8 మీరు ఆయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు .ఇప్పుడు ఆయన్ని చూడకుండానే నమ్ముతూ 9 ,మీ విశ్వాసానికి ఫలాన్ని ,అంటే మీ ఆత్మల రక్షణ పొoదుతూ ,మాటల్లో చెప్పలేనంత దివ్య ఆనందంతో 10 సంతోషిస్తున్నారు .మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించి ప్రవక్తలు ఈ రక్షణను గురించి చాలా జాగ్రత్తతో విచారించి పరిశీలించారు . 11 రాబోవు రక్షణ ఎటువంటిదో కరవోళ్ళు తెలుసుకోవాలని ఎదురు చూశారు .వారిలోని క్రీస్తు ఆత్మ,వారికి సూచిస్తూ వచ్చిన కాలాన్ని గురించి విచారించి పరిశోధించారు .క్రీస్తు బాధల గురించీ వాటి తరువాత రాబోయే గొప్పతనం గురించీ ఆత్మా 12 ముందుగానే తెలియపరచినట్టుగానే జరుగుతూ ఉంది .స్వర్గం నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు శుభవార్త ప్రకటిoచినవారు ఈ సంగతులు మీకిప్పుడు తెలియపరచారు .వారి కోసం కాక మీ కోసం తాము సేవ చేశారనే సంగతి ముత్తడు వారికి తెలియపరచాడు.దేవదూతలు కుడా ఈ విషయాలు తెలుసుకోవాలని ఆశపడుచున్నారు . 13 కనుక మీ మనస్సు అనే నడుము కట్టుకోండి .స్థిరభుద్ధితో ,యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తమకు కలిగే కృపలో 14 పూర్తిదైన ఆశాభావం పొంది ఉండండి .విధేయులైన చిక్కా సిరపగాళ్ళై ఉండండి .మీ పాత అజ్ఞాన దశలో తమకున్న దురాశలను వెంబడి ప్రవర్తిoచవద్దు . 15 మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడు.అటులనే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై 16 ఉండండి .ఎందుకనగా "నేను పరిశుద్ధుడను కనుక మీరునూ పరిశుద్దులుగా ఉండండి "అని రాసి ఉంది .ప్రతి ఒక్కరి ధర్యాబు 17 గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే ముత్తన్ని మీరు "తండ్రీ "అని పిలిచే వారైతే భూమిమీద మీరు బ్రతికే దినాలన్నీ భయభక్తులతో గడపండి . 18 తమ పూర్వికుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి ముత్తడు మిమ్మును విమోచించాడు .వెండి బంగారాల లాంటి అశాశ్వత వస్తువులతో కాదు 19 ,అమూల్యమైన కెంపుతో ,అంటే ఏ లోపం ,కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య కెంపును ఇచ్చి ,మిమ్మును విమోచించాడు . 20 ప్రపంచం ఉనికి లోకి రాక ముందే ముత్తడు క్రిస్తుని నియమించాడు .ఆకరి రోజుల్లోనే మీ కోసమా ఆయన ప్రత్యక్షమయ్యాడు .ఆయన ద్వారానే మీరు ముత్తన్ని నమ్ముతున్నారు 21 .ముత్తడాయనను కరిసిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి పంతుగానికి మహిమ ఇచ్చాడు .కనుక మీ విశ్వాసం ,ఆశాభావం ముత్తని మీదే ఉన్నాయి . 22 యథార్ధమైన సోదర ప్రేమ కోసం నిజానికి లోబడడం ద్వారా మీరు మీ హృదయాల్ని పవిత్రపరచుకున్నాడు 23 .అందుకని ఒకరినొకరు హృదయ పూర్వకంగా , ఎక్కువగా ప్రేమించుకోండి .మీరు నశనమయ్యే విత్తనం నుండి కాదు ,ఎప్పటికీ ఉండే సజీవ ముత్తని వాక్యం ద్వారా ,నాశనం కాని విత్తనం నుంచి మరలా పుట్టారు . 24 ఎందుకనగా పంతుగాళ్ళoతా గడ్డిలాంటి వారు .కరవోళ్ళ వైభవమంతా గడ్డిపువ్వు లాంటిది .గడ్డి ఎండిపోతుంది .పువ్వు 25 రాలిపోతుంది గానీ ముత్తని వాక్కు ఎల్లప్పుడు నిలిచి ఉంటుంది .ఈ సందేశమే మీకు శుభవార్తగా ప్రకటించడం జరిగింది .