1 పస్కాకు అరుణాల్తూ మినిగల్లే యేసు బేతనియకు వంచు. సొత్తోయిక్కిరు లాజరును యేసు మళ్ళీ పెపిచ్చిక్కురు గ్రామం ఇదే. 2 అటి ఆయన కోసం కలి తింగుర్తు కు ఏర్పాటు సెయ్యుసు. మార్త వడ్ఢిక్కుసు. యేసుతో పాటు కలి తింగురు బల్లచ్చి కొచ్చిండు ఇక్కిరాయులుకోరు లాజరు కూడా ఓండు. 3 అప్పుడు మరియ, అర్ధ కేజీ బరువు ఇక్కిరు స్వేచ్ఛ మైన జటా మాంసి చెల్లి కోరుండు వంగిక్కురు ఎక్కువ ఖరీదైన అత్తరును యేసు పాదాలుమినీ వాతు అభిషేకించుసు, ఆయన పాదాలను అస మొగురోటి తెలుకుసు. ఉటఆండ్డి ఆ అత్తరోటి సువాసనోటి నిండిపోసు. 4 ఆయన్ను అప్పగించురాలు, ఆయన శిష్యులు కోరు ఒండుగా ఇక్కురు ఇస్కరియోతు యూదా, 5 "ఈ అత్తరు మూన్నూరు దేనారాలుకు అమ్మి బీదాయలకు కుడుకొచ్చు అల్యా?"ఇంగుసు. 6 అత్తుకు బీదాయలు మినీ శ్రద్ద ఇందు అనుగు ఇంగల్లా గాని, అదు ఒండు దొంగ. అస అధీనం కోరు ఇక్కురు లెక్క సేంచి కోరుండు ఓడ్రోవ్వ లెక్క అస సొంతానికి అనుగు ఇంగుసు. 7 యేసు, ఈ యమ్మను సేయ్యేడిక్కంగొ, నా సమాది దినము కోసం ఈయమ్మ ఇత్తు సిద్ధ పరుసుసు. 8 బీదాయులు ఎప్పుడు నింగలచ్చి ఇక్యాదు, కానీ నాను ఎప్పుడూ నింగలచ్చి ఇక్కిమాటి అల్యా" ఇంగుసు. 9 అప్పుడు బెరూ యూదులు సమూహమం యేసు అటి కీదిండు తెలుజుగుండు, యేసు కోసమే అల్లాది, యేసు సొత్తోయి ఎద్ధిపిచ్చిక్కురు లాజరును కూడా పాకుబేకిండు వంచు. 10 లాజరును పుడుసు చాలామంది యూదులు ఎల్లిపోయి యేసు మేని నమ్మకం ఎక్కుసు. 11 కాబట్టి ప్రధాన యాజకులు లాజరును కూడా కొండ్రోడుబేకు ఇండుగుంచు. 12 ఆ తరువాత దినమున పండుగకు వందిక్కిరు గొప్ప జనసమూహం అటి పోగాసు. యేసు యెరూషలేమునకు వారక్కుదిండు కేటప్పుడు, 13 అయిలు అడ్డేరు ఖర్జురపు మట్టలు వంకుండు ఆయనకు ఎదురుగా ఓయి, "హోసన్నా! ప్రభువు పేరిట వారక్కురు ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగుబేకు గాక!" యిండు కూతోడుసు. 14 "సీయోను కుమారీ, భీతుగుమానా! నిట రాజు గాడిదట కుట్టి మేని కొందుగుండు వారక్కుదు" 15 యిండు రాసిక్కిరు విధముగా యేసు చిన్న గాడిదను పాతు అది మేని కొందుగుండుసు. 16 ఆయన శిష్యులు ఈ సంగతులు మొదటుకోరు గ్రహించిల్లా గాని యేసు మహిమ పొందిక్కిరు తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసికీదిండు, అయిలు ఆయనకు ఈ విధముగా సేందికీదిండు గుర్తు సేందుగుండు కీదు. 17 ఆయన లాజరును సమాదికోరుండు కూటు, సొత్తోయిక్కిరా లున పెగిపిచ్చప్పుడు యేసుతో ఇక్కిరు జనాంగ్లు ఆయన గురించి ఇతరులుకు సాక్షము సొన్నుసు. 18 ఆయన ఈ సూచక క్రియ సేందు కీదిండు కేటిక్కిరు కారణంగా జన సమూహం ఆయనను కలిసిగిత్తుకు ఓసు. 19 ఇత్తు గురించి పరిసయ్యులు "పారంగో, నంబురు ఎందాత సేయిమాటో. ఈ లోకం ఆయన పెరుగోటి ఎల్లిపోసు." యిండు అయిలుకోరు అయిలు సొన్నుగుండుసు. 20 ఆ పండుగకోరు ఆరాధించిత్తుకు వందిక్కిరాయిలుకో కొంతమంది గ్రీకులు కీదు. 21 అయిలు, గలిలయకోరు బెత్సయిదా వాడగు ఫిలిప్పు అచ్చుకు వంచు, "అయ్యా, నంగ్లుకు యేసును పాకుబేకిండు కీదు" ఇంగుసు. 22 ఫిలిప్పు ఓయి అంద్రెయకు సొన్నుసు. అంద్రెయ ఫిలిప్పు కలసి ఓయి యేసుకు సొన్నుసు. 23 యేసు అయిలుకు జవాబుకుర్తు, "మనుష్యకుమారుడు మహిమ బుగురు గడియ వందికీదు. 24 నింగ్లోటి ఖచ్ఛితంగా సొన్నక్కిరి, గోదమ గింజ భూమిలో బూదు సొత్తోగారుగుండా ఇందిగా, అది ఒండుగానే ఇక్యాదు. అది సొత్తోసు యిండుగో అధికంగా ఫలము తారాదు. 25 అస పాంతును ప్రేమించుగురాలు అత్తును ఓగొడుసుగాదు, కానీ, ఈ లోకముకోరు అస పాంతును ద్వేషించుగురాలు శాశ్వత జీవం కోసం అత్తును భద్రం సేందుగాదు. 26 నాకు సేవ సేయిరాలు నంబెరుగోటి వారుబేకు. అప్పుడు నాను ఏటి కీరోనో, నట సేవకుడు అటి ఇక్యాదు. నాకు సేవ సేయిరాలున తండ్రి ఘనపరుచాదు. 27 ఇప్పుడు నట పాన్తు ఆందోళన సెందక్కుదు. నాను ఎందాతు సొన్నుమాటి? 'తండ్రి! ఈ గడియ నుంచి నన్ను తప్పించు' యిండు సొన్నుదా? కానీ, ఇత్తుకోసమే నాను ఈ గడియకు సేరుగుండి. 28 తండ్రి, నిటు పేరుకు మహిమ కలిగించుకో. అప్పుడు ఆకాశముకోరుండు ఒండు స్వరము వందు ఇన్నగ ఇంగుసు, "నాను అత్తుకు మహిమ కలిగించికీరి. మళ్ళీ మహిమ కలిగించాకి." 29 అప్పుడు, అటి నిలుబూదు ఇక్కిరు జనసమూహం, "ఉరుముసు" ఇంగుసు. మిగిలిక్కిరాయ, "ఒండు దేవదూత ఆయనోటి వాచ్చుసు" ఇంగుసు. 30 యేసు జవాబు కుర్తు ఇన్నగ ఇంగుసు, "ఈ స్వరం నన్ను కోసం అల్లా. నింగ్లు కోసమే వందుకీదు. 31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుని గెమ్మూడురు సమయం. 32 నన్ను భూమి మేనుండు మేనుకు పెచ్చురప్పుడు, జనాంగ్లు అడ్డేరును నన్నచ్చుకు ఆకర్షించుగాకి. 33 ఆయన ఎంతారు మరణము పొందుగాదో, అత్తుకు సూచనగా ఆయన ఈ వాత సొన్నుసు. 34 ఆ జనసమూహం ఆయనోటి, "క్రీస్తు ఎల్లకాలము ఇక్యాదిండు ధర్మశాస్త్రముకో కీదిండు కేటో. 'మనుష్యకుమారుని మేనుకు పెచ్చురుదు జరుగుబేకు' యిండు నీను ఎన్నగ సొన్నక్కర? ఈ మనుష్యకుమారుడు ఏదు?" ఇంగుసు. 35 అప్పుడు యేసు అయిలోటి, "ఎలుతురు నింగ్లు మధ్యకోరు ఇక్కిదు ఇంకా కొంత కాలం మాత్రమే. మొబ్బు నింగ్లున కమ్ముగార్థు మినిగల్లే, ఇంకా ఎలుతురు ఇక్కిరప్పుడే, నడంగో. మొబ్బుకోరు నడుకురాలుకు, అదు ఏటుకు ఓగక్కుదో అత్తికే తెలిమాదు. 36 నింగ్లుకు ఎలుతురు ఇక్కిరప్పుడే, ఆ ఎలుతురుకో నమ్మకం ఎచ్చు ఎలుగు సంబందులు అగంగో" ఇంగుసు. యేసు ఈ సంగతులు సొన్ని, అటుండు ఓయి అయిలికి కండుబుగారుగుండా రహస్యంగా కీదు. 37 యేసు అయిలు మినిగల్లి ఎత్తునో సూచక క్రియలు సేందిగా కూడా, అయిలు ఆయనను నమ్మిల్లా. 38 ప్రభూ, నంగుట సమాచారం ఏదు నమ్మాదు? ప్రభువుట హస్తము ఏత్తుకు ఎల్లిడాసు? యిండు ప్రవక్త యెషయా సొన్నిక్కిరి వాత నెరవేరుతీరి ఇది జరుగుసు. 39 ఈ కారణంగా అయిలు నమ్మదోసు, ఎందాతుకు ఇండిగా యెషయా మళ్ళీ ఇనగా ఇంగుసు, 40 "ఆయన అస కండ్లుకు గుడ్డితనం కలుగజేయాదు. ఆయన అస హృదయాలను కఠినం చెయ్యదు. అనుగు సెయ్యందిగా అయిలు అస కండ్లు లోటి పాతు, హృదయమోటి గ్రహించి, నాజేయా తిరిగురాయ.అప్పుడు నాను ఆయులును నల్లుకు సెయ్యురాలును. " 41 యెషయా యేసు మహిమను పాకుసు కాబట్టి ఆయన గురించి ఈ వాతులు సొన్నుసు. 42 అయినా, అదికారులుకోరు కూడా చాలామంది యేసు మినీ నమ్మకం ఎక్కిసు,కానీ పరిసయ్యులు సమాజమందిరముకోరుండు అయిలును వంగోడాదిండు బీటుగుండు,ఆ విషయం ఒప్పగిల్లా. 43 అయిలు దేవురు నుంచి వార్రు మెప్పు కంటే, మెనుషుల నుంచి వార్రు మెప్పునే ఇష్టబుగుసు. 44 అప్పుడు యేసు గొప్ప స్వరంమెటి, "నన్నుకోరు నమ్మకం ఎచ్చుగుండిక్కిరాలు నన్నుకోరు మాత్రమే అల్లాది నన్ను అంపూటిక్కిరాలుకోరు కూడా నమ్మకం ఎచ్చుగాదు. 45 నన్ను పాతిక్కిరాలు నన్ను అంపూటిక్కిరాలును కూడా పాకక్కుదు. 46 నన్నుకోరు నమ్మకం ఎచ్చుగురాలు మొబ్బుకోరు ఇక్కారుగుండా ఇక్కిబేకిండు, ఈ లోకముకోకు నాను ఎలుతురుగా వంది. 47 ఏదన్నా నట వాతులు కేటు, అత్తును పాటించారుగుండా ఇందిగా నాను అత్తుకు తీర్పు తీర్చుమాటి. ఎందాతుకు ఇండిగా నాను ఈ లోకమును రక్షించింగా వంది కానీ, తీర్పు తీర్చిత్తుకు అల్లా. 48 నన్ను దొబ్బుటు, నట వాతులు అంగీకరించుమాటారాలుకు తీర్పు తీర్చురాలు ఒండాలు కీదు. నాను పలిక్కిరు వాక్కు చివరి దినాన అత్తుకు తీర్పు తీర్చాదు. 49 ఎందాతుకు ఇండిగా, నా అంతట నానే వాచ్చురుతిల్లా. నాను ఎందు సొన్నుబేకో, ఎందాదు వాచ్చుబేకో నన్ను అంపూటిక్కిరు తండ్రి నాకు ఆదేశించుసు. 50 ఆయన ఆదేశం శాశ్వత జీవం యిండు నాకు గొర్తు. అత్తికే నాను ఏవాత సొన్నిగా తండ్రి నన్నోటి సొన్నురుతీరే అయిలోటి సొన్నక్కిరి" ఇంగుసు.