అధ్యాయము 10

1 నింగులొటి ఖచ్చితంగా సోన్నక్కిరి, గొర్రెల దొడ్డికోకు ఉల్లిఓగురు ఎగోటి అల్యాదే వేరే విధంగా ఏరి ఉల్లికి వార్రాలు దొంగే, అదు దోపిడిసేయిరాలేే. 2 ఎగోటి వార్రాలు గొర్రెల కాపరి. 3 అదు కోసం కాపలా ఇక్కిరాలు ఎగి తెరసాదు. గొర్రెలు ఆయన స్వరము కేకాదు.అస సొంత గొర్రెలును పెరెచ్చు కూటు గడ్డికి నడిపిక్యాదు. 4 అస సొంత గొర్రెలను గడ్డికి ఎప్పుడు నడిపించినేగా, అయిలికి మిన్ని ఆయన నడకాదు. అస స్వరము గొర్రెలకు తెలుసు కాబట్టి అయ్య ఆయన పెరుగోటి నడుకాదు. 5 వేరెసా స్వరము గొర్రెలుకు గోర్థిల్లా కాబట్టి గొర్రెలు వేరేయా పెరుగోటి ఓగారుగుండా తప్పించుగాదు. 6 యేసు ఈ ఉదాహరణ ద్వారా అయిలోటి వాచ్చుసు గానీ ఆయన అయిలోటి సోనిక్కురు సంగతులు అయిలుకు అర్థము ఆగిల్లా. 7 అత్తుకు యేసు మళ్ళీ అయిలొటి ఇనుగు సొన్నుసు, "నింగ్లుకు ఖచ్చితంగా సొన్నక్కిరి, గొర్రెలు ఓగురు ఎగి నానే 8 నా మిన్ని వందిక్కురాయడ్డేరు దొంగలు, దోపిడీగాళ్ళే. గొర్రెలు అస వాతులు కేకిల్లా. 9 నానే ఓగురు ఎగి, నట ద్వారానే ఏదయినా ఉల్లికి ఓనిగే అత్తుకు రక్షణ దొరుకాదు. అదు ఉల్లికి వందు గడ్లికి ఓయి పచ్చికలుకోరు ఇక్యాదు. 10 దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం సెయ్యిత్తుకు మాత్రమే వారాదు.గొర్రెలుకు జీవం కలుగుబేకిండు, ఆ జీవం సమృద్ధిగా కలుగుబేకిండు నాను వందికీరి. 11 నాను గొర్రెలకు నల్ల కాపరిని. నల్ల కాపరి గొర్రెలు కోసం అస ప్రాణం కుడుకాదు. 12 జీతం కోసం పనిసేయి రాలు కాపరి తీరి అల్లా. గొర్రెలు అస్సాదు అల్లా కాబట్టి తోడేలు వార్తు పాతు గొర్రెలను ఉట్టూటు ఎల్లిపోక్కుదు. తోడేలు ఆ గొర్రెలను పుడుసుగుండు చెదరుమొతాదు. 13 జీతగాడు జీతం మాత్రమే కోరుగాదు కాబట్టి గొర్రెలను పుడిపిచ్చుగారుగుండా ఎల్లిపోక్కుదు. 14 నాను గొర్రెలకు నల్ల కాపరిని. నట గొర్రెలు నాకు గొర్తు. నట సొంత గొర్రెలకు నాను గొర్తు. 15 నా తండ్రికి నాను గొర్తు. నాకు నా తండ్రి గొర్తు. నట గొర్రెలు కోసం నట పాన్తు ఎక్యాకి. 16 ఈ దొడ్డిట అల్లాది వేరే గొర్రెలు కూడా నాకు కీదు. అయిలును కూడా నాను అసుగుండు వారుబేకు. అయి నట స్వరము కేకాదు. అప్పుడు ఇక్కిదు ఒండే మంద, ఒండే కాపరి. 17 నట పాన్తు మళ్ళీ పొందుగిత్తుకు అత్తును ఎక్కక్కిరి. అత్తుకే నా తండ్రి నన్ను ప్రేమించుక్కుదు. 18 నట పాన్తును నన్నుండు ఏదు వంగోడుమాదు. అత్తును ఎక్కిత్తుకు, తిరిగి వంకిత్తుకు నాకు అధికారము కీదు. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నాను పొందుగుండు కీరి. 19 ఈ వాతులు వల్ల యూదులుకోరు మళ్లీ విభేదాలు వందికీ దు. 20 అయిలుకోరు చాలా మంది, "ఇత్తుకు దెవ్వు పుడుసు కీదు. ఇదు పిచ్చాదు. ఇస వాతులు నింగ్లు ఎందాతుకు కేకక్కురంగా?" ఇంగుసు. 21 ఇంకొంతమంది, "ఇయి దెవ్వు పుడిసిక్కిరాలుట వాతులు అల్లా. దెవ్వు గుడ్డాలుట కళ్ళు తెరికాదా?" ఇంగుసు. 22 ఆ తరువాత యెరూషలేము కోరు ప్రతిష్ట పండుగా వంచు. 23 అది ఈదుకాలం. అప్పుడు యేసు గుడి ప్రాంగణంకోరిక్కిరు సొలొమోను మంటపంకోరు నర్దుగుండు ఇందిగా 24 యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనోటి. "ఎత్తనకాలం నంగ్లును ఇన్నగ సందేహముకో ఎక్కాక? నీను క్రీస్తు ఆసా నంగ్లోటి స్పష్టముగా సొన్ను" ఇంగుసు. 25 అత్తుకు యేసు అయిలోటి ఇన్నగ ఇంగుసు, "నాను నింగ్లుకు సొన్నికీరి గాని నింగ్లు నమ్మరు తిల్లా. నా తండ్రి పేరిట నాను సేయక్కురు క్రియలు నన్ను గురించి సాక్ష్యం తారక్కుదు. 26 అయినా, నింగ్లు నట గొర్రెలు అల్లా కాబట్టి నింగ్లు నమ్మరు తిల్లా. 27 నట గొర్రెలు నట స్వరం కేకాదు, అయి నాకు గొర్తు, అయి నంబెరుగోటి వారాదు. 28 నాను అయిలికి శాశ్వత జీవమును కుడుకాకి కాబట్టి అయి ఎప్పటికి నశించిఓగు మాదు. అయిలున నట కియ్యికోరుండు ఏదు ఎత్తుగుండు ఓగుమాదు. 29 అయిలును నాకు తందిక్కిరు నా తండ్రి అడ్డేరు కన్నా గొప్పాలు కాబట్టి నా తండ్రి కియ్యికోరుండు ఏదు అయిలున ఎత్తుగుండు ఓగుమాదు. 30 నాను, నాతండ్రి, ఒండే!" 31 అప్పుడు యూదులు ఆయనను మొతిత్తుకు కెళ్లు పుడుసుగుండుసు. 32 యేసు అయిలోటి, "తండ్రి నుంచి వందక్కిరు ఎత్తునో నల్ల పనులు నింగ్లుకు కాటిచ్చికీరి. అత్తుకోరు ఎత్తారు నల్ల పనిని పుడుసు నన్ను కెల్లోటి మొతుబేకు ఇండుగక్కురంగా?" ఇంగుసు. 33 అత్తుకు యూదులు, "నీను మొనసుగా ఇందు నిన్ను నీనే దేవురుగా సేందుగక్కుర. దేవదూషణ సేందిక్కితికే నిన్ను కెల్లోటి మొతక్కురో. నల్ల పనులు సేందిక్కితుకు అల్లా" యిండు ఆయనోటి ఇంగుసు. 34 యేసు అయిలుకు జవాబు కుర్తు ఇన్నగా ఇంగుసు, "నింగ్లు దేవురులిండు నాను ఇండికీరి" యిండు నింగుట ధర్మశాస్త్ర ముకో రాసి కీదు అల్యా? 35 లేఖనం వ్యర్థముగా ఇక్కిమాదు. దేవురుట వాక్కు ఏత్తుకు వందికీదో, అయిలున ఆయన దేవురులు యిండు కూటిగా, 36 తండ్రి పవిత్రంగా ఈ లోకముకోకు అంపూటిక్కురాలు 'నాను దేవురుట మగును' ఇండిగా 'నీను దేవదూషన సేయక్కర యిండు నింగ్లు ఇంగక్కురంగా? 37 నాను నా తండ్రి పనులు సెయ్యారుగుండా ఇందిగా నన్ను నమ్మమానంగా, 38 అయితే, నాను నా తండ్రి పనులు సేందుగుండు ఇందిగా, నింగ్లు నన్ను నమ్మగారుగుండా ఇందిగా, తండ్రి నన్నుకోరు నాను తండ్రికోరు కీరో యిండు నింగ్లు తెలుజుగుండు అర్థము సేందిగిత్తుకు ఆ పనులను నమ్మంగో." 39 అయిలు మళ్ళీ ఆయనను పుడుసుగుబేకు ఇండుగుండికి గాని ఆయన అయిలుట కియ్యికోరుండు తప్పించుగుండు కీదు. 40 యేసు మళ్ళీ యోర్దాను నది ఆపక్కుకు ఓయి అటే కీదు. యోహాను మొదట బాప్తీస్మం కుర్తుగుండు ఇక్కిరు స్థలము ఇదే. 41 చాలామంది ఆయనచ్చుకు వంచు. అయిలు, "యోహాను ఏ సూచక క్రియలను సేయిల్లా గాని ఈయన గురించి యోహాను సొన్నిక్కిరి సంగతులు అడ్డి నిజమే" ఇంగుసు. 42 అటి చాలామంది యేసును నమ్ముసు.