1 ఆనికే ఆకరి దినంగులకోరు కొద్దేరు అబద్దం సోన్నురాయిగా వేషం పోటిగిండి మోసం చేయరాయిగా ఆత్మోటి. 2 సోన్నుర వాతలకు లక్ష్యముంచి విశ్వాసముకూ వ్యతిరేకంగా ఇక్యారంగా ఇండి అత్మోటి సోన్నాకురే. 3 ఆ అబద్దం సోన్నరాయ వాత పోడించుగిండి మనస్సాక్షిగా ఇక్కిరాయ కళ్యాణంన ఉత్తోడురాయ సత్యం విషయంకోరు అనుబవం ఇక్కిరాయ విశ్వాసగ క్రుతజ్ఞతా స్తుతులు సోన్నిగేటి దేవురు సృస్టించిన ఆహార వస్తువుగా కొంతన తింగుర్త మానోడుం ఇండి సొన్నిగాగుదు. 4 దేవురు సృస్టించిన ప్రతి వస్తువున నల్లదు క్రుతజ్ఞతాస్తుతులు సోన్నిగేటి ఎదు ఉత్తోడుగుడాదు ఇండి అల్లా. 5 అదు వాక్యమోటే ప్రార్థన పవిత్రతోటి పరచాభుగాగుదు. 6 ఈ వాతల అన్నతేమ్భిమారుకు సోన్నికే నీను అనుసరించిగేటి వంద విశ్వాస వాత సంబంధం వాక్యమోటి పెంపారుచు క్రీస్తు యేసుకు నల్ల పరిచారుకుడిగా ఇక్యార. 7 వాతలైన ముసలమ్మా ముచ్చట్ల ఉత్తోటి దేవురు బక్తికోరు నీను నికే సాధకముగా చేందుగో. 8 సంబందముగా కొద్దివరకే ప్రయోజనంగా ఇక్యాకుగాని దేవురు బక్తి ఇప్పుడు జీవము విషయంకోరు వారుర్ధ జివ విషయంకోరు వాగ్ధానము ఓటి ఉండే మాటి ఇందప్పుడు అడ్డి విషయాలకోరు నల్లక కీదు. 9 ఈ దేవురు వాత నమ్మురట్టిగా పూర్ణ అంగికరము యోగ్యంగా కీదు. 10 అడ్దేరుకు రక్షకుడిగా మరి విశేషంగా విశ్వాసంకూ రక్షకుడిగా జీవము దేవురు యందు నంభూరు నిరిక్షనించాకురాం కాబట్టి ఇత్తు బట్టి ప్రయాసమోటి పాతుభుగాకురాం. 11 ఈ వాతల సొన్ని సోన్నుంగో. 12 కాటును బట్టి ఏదు నిన్నతో సోడిక్కిమాన వాతలోటి ప్రవర్తవోటి ప్రేమోటి విశ్వాసముఓటి పవిత్రఓటి విశ్వాసంగా ఇక్కిరాసు అడ్డికి మాదిరిగా ఇక్కు. 13 వారంతా వరకు చదువుకోరు హెచ్చరించు అప్పుడు వాయిస్తురప్పుడు జాగర్తగా ఇరు. 14 బెరాయ కియ్యి నిక్షేపనము చేయగా ప్రవచానములోటి నిన్న అనుగ్రహించుగేటి నికోరు ఇక్కిర వరం అలక్ష్యం చేయమాన. 15 ఎదుగుదల అడ్డేరు నల్లక కండుభుగారట్టిగా ఇసల అంగికరీంచు ఇసలే పనిగా చేందుగో. 16 గూర్చి ని వాత గూర్చి జాగర్తగా ఇరు ఇసులుకోరు నిలకడగా ఇరు నీను ఇలా చేంది నిన్న ని వాత కేకురాసుల రక్షించు.