Chapter 3

1 చివరిగా,నటు తెంబినాయిలే,ప్రభువుకోరు ఆనందించుగో.ఈ విషయాలను నింగులుకు మళ్ళీ రాసాటకం నాకందు సమస్యల్లా. నింగులకదు క్షేమకారం. 2 కుక్కల విషయం జాగ్రత్త.చెడు పనుల చేయురాయుల విషయంకోరు జాగ్రత్త. చేధించే ఆచారం పాటించురు విషయంకోరు జాగ్రత్త. 3 అంతుకిండికే, నంబురు దేవురు ఆత్మతోటి ఆరాధించిగాట ఒడుముమేనే నమ్మకం ఎచ్చుమ్ గారకుండా క్రీస్తు ఏసుకోరు అతిశయుస్తున్నాము.నంబూరె అసలైన సున్నతి పొందినాయలు. 4 చోన్నుమిండుకే, నానే ఒడుమున ఆధారం చెందునగారే.ఏదానుకు ఒడుమున ఆధారం చెందునుగుమిండికే నాను మరి ఎక్కువగా చెందుగారే. 5 ఒట్టో రోజున సున్నతి పొందునే.ఇశ్రాయేలు జాతికోరు పరిదే.బెన్యామీను గోత్రంకు చేందునామును. హెబ్రీ తల్లిదండ్రులకు పరద హెబ్రీయామును.ధర్మశాస్త్రము విషయంకోరు పరిసయం ఇక్కురామును. 6 క్రైస్తవ సంఘమున హింసించురుతుకు కంకణం కట్టిండామును.ధర్మశాస్త్రమును సంపూర్ణ విధేయతతోటి పాటించునే. 7 ఆనికానుకు ఏదాదు నాకు లాభంగా ఇక్కకదో ఆయిలడ్డును క్రీస్తుకోసరం పనికోరాయులుగా ఎంచుండె. 8 వాస్తవంగా నటు ప్రభువు యేసు క్రీస్తున తలిసింగాటకం ఎత్తనో శ్రేష్ఠమైన విషయము.కాబట్టి మిగతా సమస్తాన్ని పనికోరారుదుగా ఎంచిగికురే. అత్త పాతు మిగతా అడ్డిను ఇష్టపూర్వకంగా తిరస్కరించినే. క్రీస్తును మాత్రమే సంపాదించూరుతుకు,అయిలన చెత్తతోటే సమానంగా ఎంచునే. 9 ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక,క్రీస్తుకోరు విశ్వాసములమైన నీతి, ఇండికే విశ్వాసమున పుడుసు దేవురు అనుగ్రహించు నీతిగలమై అత్తుకోరు కండిబూగురట్టు అనుగు చెందే. 10- 11 ఏ విధంగానుకు చేత్తోనాయిలకోరు నుండి నాకు పునరుత్థానం కలుగుమిండు, అత్తు మరణ విషయంకోరు సమాన అనుభవం గలామనై, అత్తు అత్తు పునరుత్థాన బలంన తెలుజుంగురుతుకు,అత్తు హింసకోరు భాగస్వామ్యం ఆగురుతుకు,సమస్తంన నష్టపరుసుండు అయిలన పెంటతోటి సమానంగా పాకక్కిరే. 12 ఇయలడ్డిను ఇంకా నాను పొందుల్లా కాబట్టి నానింకా సంపూర్ణును అల్లా.క్రీస్తు నాన్న అత్తుకోసమానికే పుడుసుండుసొ అత్తకుడా నాను సొంతం చెందింగుమిండు నానింకా ప్రయత్నించిగాటే ఇక్కురే. 13 తెంబినాయిలే, అత్త నానిప్పుడే సాధించునిండు ఇంగాటికల్లా. ఆనికే వొండ మాత్రం చేయిక్కురే.గతంకోరు జరుగుంత ఆస్తుటు, మున్నిక్కరాయిలా కోసరం ప్రయాస బుగాక్కిరె. 14 క్రీస్తు ఏసుకోరు దేవురు ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసరం గురి కిట్టకే ఓట్లెడిజిగాట ఇక్కురే. 15 కాబట్టి విశ్వాసంకోరు దృఢంగా ఇక్కురు విశ్వాసులమైన నంబురు,అనుగె ఆలోచించుమిండు ప్రోత్సహించాకిరే.మరి ఏ విషయం గురించానుకు,నింగులు వేరే విధంగా ఆలోచించునికే దేవురు అత్త కూడా నింగులుకు స్పష్టం చేయాకుదు. 16 అందానుకు సరే, నంబురూ ఇప్పుడుకే పొందిన అదే సత్యంకు అనుగుణంగా నంబురడ్డేరూ నడువువో. 17 తెంబినాయిలే,నింగులు నన్న పోలి పర్వర్తించుగో.నంగలన ఆదర్శంగా వాంకిండు నడిచింగురాయిల జాగ్రత్తగా గమనించుంగో. 18 చాలట్టాలు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడకిక్కుదు.ఇసుకు గురించి నింగులుతోటి చాలా చార్లు చోన్నే.ఇప్పుడు కూడా దుఃఖంతోటి చొన్నక్కిరే. 19 నాశనమే అసుకు అంతము.అసుకు ఓరుగె అసుకు దేవురు.అయిలు ఒక్కబుగాలసినాయిలె గొప్పగా చోంనింగిక్కుదు.లౌకిక విషయాలమేనినే అయిలు మనసు ఎక్కాకుదు. 20 నంబురు పరలోక పౌరులం. నంబురు రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు అటు నుండే భూమి మేనుకు వారాకుదిండు ఎదురు పాతిగాట ఇక్కురో. 21 సమస్తడ్డిను ఏ శక్తితోటి అదు నియంత్రిచ్చుకుదో అదే శక్తితోటి నంబురు బలహీనమైన దేహాలను అత్తు మహిమగల దేహంలాగా మార్చి వొడాకుదు.