1 ఫిలిప్పీ పట్టణంకోరు క్రీస్తు ఏసుకు చెందిన పరిశుద్దులడ్డేరుకు సంఘ నాయకులకు పరిచారకులకు క్రీస్తు ఏసు దాసులైన పౌలు,తిమోతి రాసక్కుర సంగతులు. 2 నంబురావదేవురు నుండి ప్రభువైన యేసు నుండి నింగులుకు కృపా,శాంతికలుగుగాక 3 నాను నింగులన ఎప్పుడు గుర్తేత్తేడుకు నటు దేవురుకు వందనాలు చొన్నారే. 4 నింగులుకోసరం నాను ప్రార్ధించురు ప్రతి సారి అదు ఆనందభరితమైన ప్రార్థన. 5 సువార్త విషయంకోరు మున్నె రోజు నుంచి ఇప్పుడుదాకా నింగు సహవాసంకు వందనాలు 6 నింగులుకోరు ఈ నల్ల పని మొదలచ్చామో ఏసు క్రీస్తు తిరిగి వారుదాకా ఆ పని కొనసాగించి పూర్తి చేయాకుదు.ఇదు నటు గట్టి నమ్మకం. 7 నింగులు గురించి నాను అనుగు భావించాటకం సబబే.అంతుకిండికే నింగులు నటు హృదయంకోరు ఇక్కురంగా.నాను ఖైదీకోరు ఇందప్పుడు,నాను సువార్త పక్షంగా వాదించిగాట నిరూపించానికే నింగులడ్డేరూ ఈ కృపకోరు నంతోటె పాలాయిలుగా ఇక్కురంగా. 8 క్రీస్తు ఏసు ప్రేమ లోతులుకోరు నుంచి,నింగులు కోసరం నానంత తపించకూరుణో దేవురే నాకు సాక్షి. 9 నింగు ప్రేమ జ్ఞానంతోటి,సంపూర్ణ వివేచనతోటి అడ్డికడ్డీకు వృద్ధి చెందుమిండు నాను ప్రార్ధించకిరే. 10 దేవురుకు మహిమ,స్తుతి కలుగురట్టు నింగులు శ్రేష్ఠమైన విషయాలన పరీక్షించి తెలుజుండు, యేసు క్రీస్తు ద్వారాగా కలుగురు నీతి ఫలాలతోటి నిండు, క్రీస్తు వారు రోజు దాకా యదార్ధంగా నిర్ధోశంగా ఇక్కటాకమే నటు ప్రార్ధన 11 అదల్లదే 10దేవురుకు మహిమ,స్తుతి కలుగురట్టు,నింగులు యేసు క్రీస్తు ద్వారాగా కలుగురు నీతి ఫలాలతోటి నిండు ఇక్కుము. 12 తెంబినాయిలే, నాకు సంభవించును సువార్త మరి ఎక్కువగా వ్యాపించుము యిండు నింగులు తెలుజుంగుము. 13 ఏనుగిండుకె,నటు సంకెళ్లు క్రీస్తు కోసరమే కలుగమునిడు రాజ భవనం ఆగమిందు అయిలుకు తక్కిన అడ్డేరుకు తెలుజొసు. 14 అదలదే, ప్రభువు తెంబినాయిలుకోరు ఎక్కువమంది నటు బంధకాలన బుడుసు స్థిర విశ్వాసం కలిగి,నిర్భయంగా దేవురు వాక్కు ప్రకటించురుతుకు ఎక్కువ ధైర్యం ఎత్తేందుడుసు. 15 కొద్దిగట్టాలు అసూయతోటి కలహా బుద్దితోటి,మరి కొద్దిగట్టాలు నల్ల ఉద్దేశం తోటి క్రీస్తున ప్రకటించకుదు. 16 ప్రేమతోటి క్రీస్తున ప్రకటించురాయులుకు నాను సువార్త పక్షనే వాదించురుతుకు నియామకం పొందునిండు తెలువు. 17 ఆనికే మిగతాయిలు బంధకాలుకోరు ఇక్కురు నాకు ఇంకా బాధ కలిగించుమిండు సుద్ద మనసుతోటి అల్లకుండా కక్ష తోటి క్రీస్తున ప్రకటించకిదు. 18 అనికందు?కపటంతోటి కానీ సత్యంతోటి కానీ,ఎనుగానుకు క్రీస్తున ప్రకటించడం మాత్రం జరిగిగాట ఇక్కుదు.అట్టుకు నాను ఆనందించికిరే.ఇంక మున్నెకుడా ఆనందించారే. 19 నింగు ప్రార్ధనల వలన, యేసుక్రీస్తు ఆత్మ సాయం వలన,నటు విడుదల కోసం ఇదడ్డు జరిగిగాట ఇక్కుదిండు నాకు తెలువు. 20 నాను ఏ విషయంకోరానుకు సిగ్గుపాలు అగమాటినుండు నాకు సంపూర్ణ ఆశాభావం ఇక్కుదు.ఆనికే,ఎప్పుడు లాగానే ఇప్పుడు కూడా నటు జీవం వలన కానీ,చేత్తోగటకం వలన గాని క్రీస్తును నటు ఒడుముతోటి ఘనపరచారే. 21 నటుమటుకానికే పెకాటకం క్రీస్తే, మరి చాగాటకం లాభమే. 22 అనికానుకు వోడుముకోరు నానింకా పెగిసిగాట నటు ప్రయసకు ఫలితం ఇందికే, అప్పుడు నానంత కోరింగుమో నాకు తెలాటుకిల్లా 23 ఈ రెండింటి మద్యకోరి ఇరికిండే. నాను లోకం వుట్టెచ్చు క్రీస్తుతోటినే ఇక్కుమిండు నటు కోరిక.అడ్డికంటే అదే నల్లదు. 24 అనికానుకు నటు వోడుము తోటే ఇక్కటాకం నింగులుకోసరం అవసరం. 25 - 26 అత్తు ద్వారాగా,నాను నింగు కిట్టకు తిరిగి వారాటకం వల్ల నన్న బుడుసు క్రీస్తు ఏసుకోరు నింగు అతిశయం ఎక్కువాక్కుదు.నింగులు విశ్వాసంకోరు అభివృద్ధి, ఆనందం పొందురుతుకు నాను జీవిస్తూ నింగు అడ్డేరుతోటే ఇక్కారిండు నాకు తెలువు. 27 నాను నింగులన పాకురుతుకు వొందికానుకు, వారదోనికానికు, అడ్డేరూ కలిసి కట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడిగాట,ఏక భావంతోటి నిలబుదు ఇక్కరంగినడు నాను నింగులన గురుంచి వినురట్టు,నింగులు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుగో. 28 నింగులన బెదురించురాయిలుకు ఎ విషయంకోరు బీతింగుమానుంగొ.నింగు ధైర్యం అయిలుకు నాశనం, నింగులకు రక్షణ కలగాకుదిండు తెలుపురు సూచన.ఇదు దేవురు వలన కలిగే విడుదల. 29- 30 గతంకోరు నాను సాగించిన పోరాటంన పాతంగా.అత్తు గురించి వినక్కురంగా.నింగులు కూడా అదే పోరాటంకోరు ఇక్కురంగా. కాబట్టి దేవురు నింగులుకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే అల్లకుండా,అత్తు కోసరం కష్టాలు అనుభవించురూ అవకాశం కూడా కలిగించుసు.