Chapter 1

1 యేసు క్రీస్తుకు బానిస అపొస్తలుడు ఆనికే సిమెను పేతురుకు నంబురు దేవురు రక్షకుడు ఆనికే యేసు క్రీస్తు నీతిన బటి నగులాగే అమూల్యమన విశ్వాసాని స్వీకరించిన అయిలుకు రాయురుదు సంగతులు. 2 దేవురులో నన ప్రభువు యేసుకోరు పూర్తి జ్ఞానం ద్వారా నింగులుకు కృప శాంతి విస్తరికకు గాక. 3 అత మహిమకోరు బటి నల్ల గుణాన్ని బట్టి నిగులును ఆకురుతుకు దేవురు అత జ్ఞాన ద్వారా అత శక్తి ములముకోరు నంగులన జవం దైవభక్తి కలుగుసు జీవించురుతుకు అగుముఈడు కుడుచు. 4 ఆయులును బాటే అదు నంగులుకు అమూల్యమైన వాగ్దానాలు కుడుచు.ఈ వాగ్దానాల మూలంగా దుష్టుమైన అసలోకోరు నిండిన ఈ లోకంకోరు చెడుతానకోరు నిండు తపించుడు నింగులుకు అత స్వభావకోరు పంచుకొనిగిరిదే దేవురుకు ఉదేశం. 5 ఈ కారణంకోరు నిగుంలు పూర్తి భక్తి శ్రద్దలు కలుసుడు ని విశ్వాసంకోరు పాటు నల్ల గుణం మంచి గుణంకోరు జ్ఞానం 6 జ్ఞానంకోరు పాటు అసెలు అదుపులు అసలు అదుపుకోరు ఓర్పు ఓర్పుకోరు భక్తి 7 భక్తితో పాటు దయ దయకోరు ప్రేమ కలుగును ఇక్కి. 8 ఇందు నింగులుకోరు ఇందు వృద్ధి చెదపుడు నంగులు ప్రభు యేసు క్రీస్తు ను తెలుసుడు జ్ఞానం మందకొడిగా నషాలంగా యిలా. 9 ఆనికే ఈ గుణాలు ఇలాధోనీకు అదు గతంకోరు చెంద పాపాలను దేవూరు క్షమించండి అసతోడకి .అదు దురధిష్ఠి ఇలా గుడివాడుఅసు. 10 కాబట్టి సోదరునాయులే నింగులు పిలుపుకోరు మీ ఎన్నికను స్థిరం చెదురుతుకు పూర్తి శ్రద్ద కలిగి ఇక్కుము. అపోరు నింగులుకు ఎపోరు తడబుగుదుల. 11 అత ద్వారా నాగులు ప్రభువు రక్షకుడు ఆనికే యేసు క్రీస్తు రాజ్యాంకోరు ఘనమైన ప్రవేశంకోరు నింగులుకు ధోరకాకు. 12 అయిలు గురించి నింగులుకు మునే తెలుసుడు నింగులు అంగీకరించిన సత్యంకోరు స్థిరంగా ఇక్కి. ఈ సంగగులు నింగులుకు ఎపోరు గుర్తుకు చెందిగాట ఇక్కకు. 13 నను ఈ ఓడుము అనే గుదరంకోరు ఇకిరట్లుగా వరకు ఈదు నింగులుకు గుర్తుచేయటకం నల్లదిండు బావిచాకిరే. 14 నాగులు ప్రభువు యేసు క్రీస్తు మునిగనే నాకు వెల్లడి చెంద ప్రకారం నను త్వరలోకోరు ఈ ఓడుము వదులోటుసు నాకు తెలువు. 15 నను చేత్తోన తరువాత కూడా నింగులు అయిలన గుర్తు చెదుడు శ్రద్ద వాకుగుము. 16 అతకుడికీ నంగులు ప్రభువు యేసు క్రీస్తు శక్తి అదు రకడా గురించి చకచక్యగా ఆలిండు కల్పన కధలుకోరు నగులుకు నింగులుకు సోనుల అదు గోపాదనని కలరా పచు ఆయులుదేరుకు సోచు. 17 అయిలు నన అవా అనికు దేవురు నుడి ఘనత మహిమ పొదిగా అదు నా ప్రియ కుమారుడు అదు విషయంకోరు నను ఆనందముబుగాకిరే అనే గోప మహిమకోరు దైవస్వరం వధపుడు 18 అతుతో నాగులు ఆ పవిత్ర పర్వతం మేనే ఇధ మేనేనుంచివద్ద ఆ స్వరని స్వయంగా కేటా. 19 ఇతకుఎడికే స్థిరమైన ప్రవచన వాక్యకోరు నంగులుకు ఇక్కి.తరాజములే వేకువచుక ని హృదయముకోరు తరాజములే వరకు ఆ వాక్యం చికటికోరు వెదలుతురు తదా దీపంలా ఇక్కి.ఆ వెలుగును నింగులు గ్రహించునికే నింగులుకు మేలే. 20 లేఖనకోరు రాసిన ప్రవచనాలు మొచో ఊహాలుకోరు నుండి పెగిచిలఈడూ నింగులుకు మునిగనే గ్రహించుము. 21 ప్రవచనం ఎపొరు మోచో ఊదేశంకోరు నుండి పేరుగులే పవిత్రాత్మకోరు నిండిన మొచురులు వసేతేకోరు వచ్చు.