Chapter 3

1 విశ్వాసి నమ్మకంత్కు,అబిలాశాలకు,ఎదురు చూపుకింకి నమూనా(ఫిలిప్పి3;1-21) యూదు మతంతగ్గ మార్చవాలింజో ఊడన్ వోరి విషయం హెచ్చరిక చివరత్కు,నా తమ్ములారా,పెబువుతా కుసేల్గామన్నాట్.ఈ మాటానే మీకు రాసటం నాకుబాత సమస్య అయ్యో.మీకద్దు క్షేమకరం. 2 నెయ్కీన్ విషయం జాగ్రత్త.నరికీదాన్ ఆచారం పాటిసాన్ వారి విషయం జాగ్రత్త. 3 బారితుకు, మనర్ దేవుని ఆత్మతో ఆరాదిసోర్ ఒల్డు పోర్రో నమ్మకం వాతకుంట క్రీస్తుయేసుతే అతిశాయిసోర్మిందాను.మనారే అసలత్త దేవుని జనుర్కు. చట్టసంబందమత్త మంచితీన్ నమ్మటం. 4 కేత్తవాలితుకు,నిజంగా నన్నే ఒల్దుతీన్ ఆధారం తుంగగల్గితాన్.బెనోరత్కన్న ఒల్దుతీన్ ఆధారం తుంగవాలితుకు నన్న మరి ఎక్కువగా తుంగగల్గితాన్. 5 ఎనిమిదో రోజు సున్నతి పోంద్తాను.ఇశ్రాయేలు జాతితే పుట్తాను.బెన్యామీను గోత్రంత్కు చెంద్తవాండు. హెబ్రీ తప్పేతల్లూర్కు పుట్త హేబ్రియుణ్ణి.ధర్మశాస్త్రం విషయంతే పరిసయుణ్ణి. 6 క్రైస్తవ సంఘంతీన్ హింసింసనాంకు కంకణం కట్టుకుట్టో౦డు.ధర్మశాస్త్రంతీన్ సంపూర్ణ విదేయతో పాటిస్తాను. మంచి కలగనాల విశ్వాసింకు మందాన్ నమ్మకంత్కు ఆధారం. 7 అత్కన్న బేవి నాకు లాభంగా మందనావో వాటినంతా క్రీస్తు సేంకే పనికిరానివిగా ఎంచ్తాను. 8 నిజంగా నా పెబువత్త ఎసుక్రీస్తుతీన్ ఎరాగడమే బెచ్చోటో శ్రేష్టమత్త విషయం.కాబట్టి మిగతా సమస్తంతీన్ పనికివాదిల్వద్గా ఎంచుకుండ్జోందాను. ఒనిన్ పోయిసి మిగతా వాటన్నిట్కు ఇష్టపూర్వకంగా తిరస్కరీస్తాను.క్రీస్తుతీన్ మాత్రమే కలిగి మందనాంకి, వాటిన్ చెత్తతో సమానంగా ఎంచ్తాను. 9 క్రీస్తుతే నాకింజే సంబందం మిందే.ధర్మశాస్త్ర సంబందమత్త నా సొంత మంచి నాకు ఇల్లే.దానికి వేరేగా,క్రీస్తుతే నమ్మకం ద్వారా దేవుడిత్త మంచి నాకు మందే. (4)పునరుత్థాన శక్తితో సహవాసంత్కు విశ్వాసింకు ఆధారం క్రీస్తు 10 అద్దు ఓనిను ఎరిగే మంచి.ఓండు పునరుత్థాన శక్తితీన్ ఒన్ శ్రమలను పంచుకుండాన్ మంచి. 11 ఒన్ మరణ అనుబవంతగ్గా క్రీస్తు నానిన్ మారస్తోండు.బెలగత్కన్న సరే,నన్న డొల్లత్త వారినుంచి గిర్రుడ్డి బతకాన్ అనుబవం కలిగి మందవాలింజో ఓండు అలా తుంగ్తోండు. 12 వీటన్నిటిని ఇంకా నన్న పొందిల్లాను కాబట్టి నన్నింకాసంపూర్ణుణ్ణి అయ్యో.క్రీస్తు నానిన్ బాద్దాన్సేంకే పోయిత్తోండో దానిన్ నన్న కూడా సొంతం తుంగవాలింజో నన్నింకా ప్రయత్నీసోరే మందాను. 13 తమ్ములారా,దానిన్ నన్న ఇంజేట్కు సాదిస్తానింజో కేత్తటం ఇల్లాన్.అత్కు ఒర్రోట్ మాత్రం తుంగొందాను. గతంతా జరగ్త దానిన్ మరి౦గీసి,మున్నేట్ వాటి సేంకే ప్రయాస పర్సోందాను. 14 క్రీస్తుయేసుతే దేవుని వున్నతమత్త పిలుపుత్కు సంబందిస్తా బహుమతి సేంకే గురి దగ్గరకే మిర్రొర్ మిందాను. ప్రవర్తనత అయ్క్యత హెచ్చరిక 15 కాబట్టి నమ్మకంతా గట్టిగా మత్త విశ్వాసులమత్త మనార్,అలానే ఆలోచించవాలింజో ప్రోత్సహీసోందాను.మరే విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిసోర్మతుకు దానిన్ దేవుడు కూడా మీకు స్పష్టం తుంగితోండు. 16 బాతత్కన్న సరే, మనార్ ఎంజేటికే పోంద్తా అద్దె సత్యంత్కు మనరంత లోబరసోర్ మందకాట్. అత్కు అయ్క్యత సేంకింజో సత్యంతీన్ నిర్లక్ష్యంత్కు గురి తుంగగూడు . 17 తమ్ములారా,మీరు నానిన్ పోలి ప్రవర్తీసాటు.మామిన్ ఆదర్శంగా తీసుకుండ్జి నడుచుకుండన్వారింగా జాగ్రత్తగా గమనీసాటు. 18 చాలా మంది క్రీస్తు సిలువత్కు శత్రువుల్గా నడసోందొరు.వీరిన్ గురించి మీతో చాలా సార్కు కేత్తాను.ఇంజే కూడా దుఖంతో కేచ్చోందాను. 19 నాశనమే వోరి ముగింపు.వోరి డొక్కే వోరి దేవుడు.వోరు తాము సిగ్గుపర్దన్ వాటినే గొప్పగా కేచ్చోందొరు.లౌకిక విషయాల పోర్రే మనసు తాసితోరు. విశ్వాసి నిరీక్షనత్కు ఆధారం క్రీస్తు . 20 మనార్ పరలోక పురుల్కు.మన రాక్షకుడ్డత్త యేసుక్రీస్తు పెబువు అగ్గా నుండే భూమితగ్గ వాతోండింజో ఎదురూడోర్ మందాం. 21 సమస్తంతీన్ బే శక్తితో ఓండు నియంత్రిసోందొండో అద్దె శక్తితో మన బలహీనమత్త భూసంబందమత్త ఒల్దీన్ ఒన్ మహిమగల ఒల్డులాగ మార్చి వాటితోండు.